SSMB29: ఆ విషయంలో మహేశ్‌ అభిమానులు అసంతృప్తి..

ABN , Publish Date - Jan 26 , 2025 | 02:23 PM

ప్రియాంక రాక ప్రిన్స్‌ ఫ్యాన్స్‌కు ఏ మాత్రం నచ్చట్లేదని టాక్‌ నడుస్తోంది. మహేష్‌ పక్కన ప్రియాంక చాలా ముదురుగా కనిపిస్తుందన్నది అభిమానుల వాదన


మహేష్‌ బాబు(Mahesh Babu) , రాజమౌళి కాంబోలో తెరకెక్కునున్న సినిమాలో గ్లోబల్‌స్టార్‌ ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా (Priyanka chopra) దాదాపుగా ఖాయమైపోయినట్టే. అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఆమె ఈ సినిమాలో ఫైనల్‌ అయినట్లు శనివారం ఆమె చేసిన పోస్ట్‌తో దాదాపు ఖాయమైనట్లే అని తెలుస్తోంది.  ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో ఉన్నారు. ఇప్పటికే లుక్‌ టెస్ట్‌ కూడా జరిగింది. రాజమౌళి (SS Rajamouli) అన్ని రకాలుగా ఆలోచించే ప్రియాంకాను ఫైనల్‌ చేశారని టాక్‌.  అయితే ప్రియాంక రాక ప్రిన్స్‌ ఫ్యాన్స్‌కు ఏ మాత్రం నచ్చట్లేదని టాక్‌ నడుస్తోంది. మహేష్‌ పక్కన ప్రియాంక చాలా ముదురుగా కనిపిస్తుందన్నది అభిమానుల వాదన. ప్రియాంక వయసు 42. మహేష్‌ తో పోలిేస్త ఏడేళ్లు చిన్నదే. కాకపోతే ఈ జోడీ అంత చూడ ముచ్చటగా ఉండదన్నది హీరో ఫ్యాన్స్‌ భయం. ఇప్పటికే మహేష్‌ ఫ్యాన్స్‌ ఈ కాంబో గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ప్రియాంక కంటే మంచి హీరోయిన్‌ని వెదికి పట్టుకోవాల్సింది కదా అని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇక్కడ మరో ట్విస్ట్‌ కూడా ఉంది. ప్రియాంక పాత్ర రెగ్యు?ర్‌ కమర్షియల్‌ హీరోయిన్‌లా ఉండదని, కీలకమైన పాత్రలో ఆమె కనిపించనుందని చెబుతున్నారు. హీరోయిన్‌గా మరొకరు కనిపించే అవకాశం వుంది. ఈ సినిమా కోసం కొంతమంది విదేశీ కథానాయికలకు ఆడిషన్స్‌ జరిగాయి. ఇండోనేషియా నుంచి ఓ నటిని ఎంచుకున్నారని సమాచారం. తనే.. ప్రధాన పాత్ర కథానాయిక కావొచ్చు. ఆమె ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ఈ సినిమాలో చాలామంది ఫారెన్‌ నటీనటులు ఉంటారని సమాచారం. మహేశ్‌ హీరోగా పాన్‌ వరల్డ్‌ సినిమాగా మలచాలని భావిస్తున్నారు. అందుకే ఈసారి విదేశీ నటీనటులకు ప్రయారిటీ ఇస్తున్నారని సమాచారం. అయితే అసలు హీరోయిన్‌ ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే! (Mahesh Babu fans  Dissatisfied)

Updated Date - Jan 26 , 2025 | 02:25 PM