SSMB29: మహేశ్ - రాజమౌళి షూట్ షురూ!
ABN , Publish Date - Jan 01 , 2025 | 10:41 AM
సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్‌ఎస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే! ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది అయితే. సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుంది?
సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్‌ఎస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే! ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది అయితే. సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుంది? అని ప్రేక్షకులంతా ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్లందరికీ గుడ్‌న్యూస్ అందింది. జనవరి 2వ తేదీ, గురువారం నాడు పూజా కార్యక్రమాలతో మహేష్ బాబు, ఎస్‌ఎస్ రాజమౌళి సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉదయం పది గంటలకు ఓపెనింగ్ జరుగుతుంది. మామూలుగా తన సినిమా ప్రారంభోత్సవానికి మహేష్ బాబు హాజరు కారు. మరి ఈ సినిమాకు వస్తాడా లేదా అన్నది చూడాలి. ఈ కార్యక్రమానికి పరిశ్రమలో ప్రముఖులతోపాటు వంద మందికి పైగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. (SSMB29 Launch on 2 january)
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చిత్రీకరణలో కొంత భాగం అల్యూమినియం ఫ్యాక్టరీలోనే షూటింగ్ చేశారు. ఆ సమయంలోను రాజమౌళి ఆఫీస్ అక్కడే ఏర్పాటు చేశారు. బాహుబలి కోసం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ చేసినప్పుడు తన ఆఫీసును అక్కడే ఏర్పాటు చేశారు రాజమౌళి. ఇప్పుడు కూడా అంతే... అల్యూమినియం ఫ్యాక్టరీలో మహేష్ బాబు సినిమా షూటింగ్ కొంత చేేసలా ప్లాన్ చేస్తున్నారు. అందుకని ఆఫీస్ అక్కడ ఏర్పాటు చేశారు. సుమారు ఏడాదిగా అక్కడ ఈ సినిమా పనులు చేస్తున్నారని సన్నిహితుల నుంచి సమాచారం. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఆఫ్రికాలో జరగనుంది. కొన్ని రోజుల క్రితం కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్ వెళ్లిన రాజమౌళి, లొకేషన్ రెక్కీ నిర్వహించి వచ్చారు. ఆయనతో పాటు తనయుడు ఎస్‌ఎస్ కార్తికేయ కూడా ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఆఫ్రికాలో ప్లాన్ చేస్తున్నారు. కెన్యాతోపాటు సౌత్ ఆఫ్రికాలోని కొన్ని లొకేషన్లలో కూడా షూటింగ్ చేేస అవకాశం ఉందని తెలిసింది. దుర్గా ఆర్ట్ప్ పతాకంపై కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.