Uday Raj: టీనేజ్ లవ్ స్టోరీ మధురం...

ABN , Publish Date - Mar 29 , 2025 | 05:47 PM

1990 నాటి ప్రేమకథతో తెరకెక్కింది 'మధురం' చిత్రం. ఈ గ్రామీణ నేపథ్య ప్రేమకథా చిత్రం ఏప్రిల్ 18న జనం ముందుకు రాబోతోంది.

యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా రాజేష్ చికిలే దర్శకత్వంలో యం. బంగార్రాజు నిర్మించిన చిత్రం 'మధురం'. ఎ మెమొరబుల్ లవ్ అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ తో సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది. ఏప్రిల్ 18న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ, 'నిర్మాత బంగార్రాజు గారు ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. అలాగే డైరెక్టర్ రాజేష్ అత్యద్భుతంగా ఈ కథను తెరకెక్కించారు. మా కెమెరామెన్ మనోహర్ ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ సూపర్బ్ సాంగ్స్ ఇచ్చారు. ఇదో క్లీన్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అందరూ ఎంజాయ్ చేసే విధంగా మూవీ ఉంటుంది. ఈ సినిమా నాకు టర్నింగ్ పాయింట్ అవుతుంది" అని అన్నారు.


దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ.. ''1990 నేపథ్యంలో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. సినిమా చూశాక అప్పటి వాళ్ళ స్కూల్ డేస్, కాలేజ్ డేస్ గుర్తుకు తెచ్చేలా ఈ మూవీ ఉంటుంది. ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది" అని చెప్పారు. సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి అయిన ఈ సినిమాలో హీరో ఉదయ్ రాజ్, హీరోయిన్ వైష్ణవీ సింగ్ చక్కగా నటించారని కితాబిచ్చారు. ఇందులో తనకో మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు వైష్ణవీ సింగ్ థ్యాంక్స్ చెప్పింది.

Also Read: L2 Empuraan Writer: ఎవరికి నచ్చింది వాళ్లు మాట్లాడుకోండి...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 29 , 2025 | 06:15 PM