Madam: ఈ సినిమా చూడాలంటే గుండె ధైర్యం కావాలి..
ABN , Publish Date - Feb 10 , 2025 | 01:02 PM
హర్ష గంగవరపు(Harsha Gangavarapu), లతా విశ్వనాథ్(Latha vishwanath) , ఇనయ సుల్తాన ప్రధాన పాత్రల్లో సూర్యదేవర రవీంద్రనాథ్ (చిన్న బాబు), రమేష్ బాబు కోయ నిర్మించిన చిత్రం ‘మదం’. వంశీ కృష్ణ మల్లా (Vamsi Krishna Malla) దర్శకత్వం వహించారు.
హర్ష గంగవరపు(Harsha Gangavarapu), లతా విశ్వనాథ్(Latha vishwanath) , ఇనయ సుల్తాన ప్రధాన పాత్రల్లో సూర్యదేవర రవీంద్రనాథ్ (చిన్న బాబు), రమేష్ బాబు కోయ నిర్మించిన చిత్రం ‘మదం’. వంశీ కృష్ణ మల్లా (Vamsi Krishna Malla) దర్శకత్వం వహించారు. మార్చి 14న ఈ సినిమా విడుదల కానుంది . సినిమా టీజర్‌ను తండేల్ (Thandel) సినిమాతో పాటుగా థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. టీజర్ కు వస్తున్న స్పందన గురించి చిత్ర బృందం స్పందించింది.
డైరెక్టర్ వంశీకృష్ణ మల్లా మాట్లాడుతూ " నిర్మాత రమేష్ గారు ఇచ్చిన కథను చూసినప్పుడు నాకు చాలా భయమేసింది. ఇంతటి రా, రస్టిక్ సినిమా తెలుగులో రావడం అరుదు. తమిళం, మలయాళం భాషల్లో ఇలాంటి కంటెంట్ వస్తుంటుంది. ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటి వరకు ఇండియన్ సినీ హిస్టరీలో రాలేదు. ఈ మూవీని చూడాలంటే చాలా గుండె ధైర్యం కావాలి’ అని అన్నారు.
ఇనయ సుల్తానా (Inaya sulthana) మాట్లాడుతూ.. ‘నాకు నెగెటివ్ పాత్రలు చేయడమంటే ఇష్టం. మదం చిత్రంలో నేను చాలా ఇంపార్టెంట్ కారెక్టర్‌ను చేశాను. మా డైరెక్టర్ వంశీ గారు సినిమాను అద్భుతంగా తీశారు. నా క్లిష్ట పరిస్థితుల్లో వంశీ గారు సపోర్ట్‌గా నిలిచారు " అన్నారు. ‘మదం సినిమాకు కథే హీరో. ఇందులో హై ఎమోషన్స్ ఉంటాయి. దానికి తగ్గ పాత్రలు అందరికీ పడ్డాయి. నటించే స్కోప్ అందరికీ దొరికింది" హర్ష గంగవరపు అన్నారు. "నా నిజ జీవితంలో దగ్గరగా ఉండే పాత్రను పోషించాను. అందుకే నాకు ఎక్కడా కష్టంగా అనిపించలేదు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్" అని లతా విశ్వనాథ్ చెప్పారు.