Laila: స్టార్ హీరోయిన్‌లు కుళ్లుకునేలా చేసిన విశ్వక్.. కానీ
ABN , Publish Date - Feb 06 , 2025 | 10:33 AM
కొత్తగా ఏం జరిగింది, అనుకున్నదే అయ్యింది. విశ్వక్ సినిమాకు సెన్సార్ నుంచి ఎలాంటి రిపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తామో అలాంటి రిపోర్టే వచ్చింది. కానీ.. ఈ సారి మరింతా..
విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ హీరోహీరోయిన్లుగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘లైలా’. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ గా నిలిచినా విశ్వక్..ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ లేడి గెటప్ లో కనిపించనున్నాడు. లేడి గెటప్ లో విశ్వక్ స్టార్ హీరోయిన్లను సైతం కుళ్లుకునేంత అందంతో కనిపించాడు. ఇది ఇలా ఉండగా.. ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సినిమా పోస్టర్లు, టీజర్ అట్రాక్టింగ్ గా ఉన్నాయి. కానీ సెన్సార్ రిపోర్ట్ చూస్తే మాత్రం షాక్ అవుతారు.
తాజాగా ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే ఈ సినిమాలో యాక్షన్, క్రైమ్, వయలెన్స్ ఉంటుందా అనే అనుమానాలు రావొచ్చు కానీ.. ఇప్పటి వరకు చూసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ లో ఆ ఆనవాలు కనిపించలేదు. అంటే చాలామంది భావించినట్లే ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉండనుంది. దీంతో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఈ సినిమాని చూడటానికి అనుమతి లేదు. ఈ సినిమా టీజర్ లో ‘నా సైలెన్సర్ పట్టుకున్నాడు’ వంటి డబల్ మీనింగ్ డైలాగ్స్ వినిపించాయి. మరోవైపు ఈ సినిమా నిడివి 2 గంటల 15 నిమిషాలుగా సెన్సార్ లాక్ చేసింది.
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహూ గారపాటి నిర్మిస్తోండగా లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.