HIT 3: నాని సినిమా షూటింగ్‌లో విషాదం

ABN , Publish Date - Jan 01 , 2025 | 12:52 PM

నాని (Nani) హీరోగా నటిస్తున్న 'హిట్‌ 3' (Hit 3) షూటింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. కె.ఆర్‌.క్రిష్ణ అనే మహిళా గుండెపోటుతో మృతి చెందారు.

నాని (Nani) హీరోగా నటిస్తున్న 'హిట్‌ 3' (Hit 3) షూటింగ్‌లో విషాదం చోటు చేసుకుంది.  శైలేష్‌ కొలను (Sailesh kolanu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ జమ్మూ కాశ్మీర్‌, శ్రీనగర్‌లో జరుగుతోంది. ఈ సినిమాకు అసిస్టెంట్‌ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్న కె.ఆర్‌.క్రిష్ణ అనే మహిళా గుండెపోటుతో మృతి చెందారు. ఆమె వయసు 30 సంవత్సరాలు. కేరళలో పుట్టిన ఆమె సినిమాలపై ఉన్న మక్కువతో సినిమాటోగ్రాఫర్ పని చేస్తున్నారు. క్రిష్ణ మరణం పట్ల సినీ బృందం నివాళులు అర్పించింది. (Kr Krishna died with Cardicac arrest)

Updated Date - Jan 01 , 2025 | 12:52 PM