Krishna and His Leela: ఫస్ట్ ఓటీటీలో.. ఐదేళ్ల తర్వాత పేరు మార్చి..
ABN , Publish Date - Feb 03 , 2025 | 02:36 PM
కరోనా కారణంగా 2020లో ఆహా వేదికగా విడుదలై యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే సిద్థూకి యూత్‌లో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రం థియేటర్ రిలీజ్‌కు రంగం సిద్థమైంది.
సిద్థూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా నటించిన చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ (Krishna and His Leela). రవికాంత్ పేరేపు దర్శకుడు. రానా దగ్గుబాటి (Rana Daggubati) సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కింది. శ్రద్థా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ కథానాయికలుగా నటించారు. ట్రైయాంగిల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం విబి?న్న ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా కరోనా కారణంగా 2020లో ఆహా వేదికగా విడుదలై యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే సిద్థూకి యూత్‌లో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రం థియేటర్ రిలీజ్‌కు రంగం సిద్థమైంది. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈసారి ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ (It's Complicated) పేరుతో ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం స్పెషల్ వీడియో షేర్ చేసింది. రానా - సిద్దు జొన్నలగడ్డ సరదా సంభాషణలతో ఈ వీడియో ఆకట్టుకుంటుంది. (Krishna and His Leela IN Theaters)
కథ:
వైజాగ్‌కు చెందిన కృష్ణ (సిద్థూ జొన్నలగడ్డ) తన స్నేహితురాలు సత్య (శ్రద్థా శ్రీనాథ్)తో ప్రేమలో పడతాడు. అనివార్య కారణాల వల్ల వారిద్దరూ విడిపోతారు. ఉద్యోగ వేటలో భాగంగా కృష్ణ బెంగళూరుకు వెళ్తాడు. అక్కడ రాధ (షాలిని) అనే అమ్మాయితో కృష్ణకు పరిచయం ఏర్పడుతుంది. కొంతకాలానికి వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అదే సమయంలో అతడి జీవితంలోకి మళ్లీ సత్య ఎంట్రీ ఇస్తుంది. మరి, కృష్ణ ఏం చేశాడు? వారిద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? కృష్ణకు రుక్సార్ (సీరత్ కపూర్)కు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది సినిమా.