Kishore Tirumala: ఒకరు క్లాసు.. ఒకరు మాస్.. ఎలాంటి సినిమా వస్తుందో..
ABN , Publish Date - Mar 01 , 2025 | 07:22 PM
క్లాస్ టచ్ ఉన్న సినిమాలకు కేరాప్ కిశోర్ తిరుమల(Kishore Tirumala). ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగి’, ‘చిత్రలహరి’.. వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
క్లాస్ టచ్ ఉన్న సినిమాలకు కేరాప్ కిశోర్ తిరుమల(Kishore Tirumala). ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగి’, ‘చిత్రలహరి’.. వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతకాలంగా ఆయన నుంచి ఏ సినిమా అప్‌డేట్ లేదు. సైలెంట్‌గా ఉన్నారు. అంటే ఆయన ఏదో ప్రయత్నంలో ఉన్నారనే ఆయన స్నేహితులు చెబుతున్నారు. ఇప్పుడు మళ్లీ కిషోర్ పేరు వినిపిస్తోంది. రవితేజకు ఓ కథ చెప్పారని, అది ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని టాక్ నడుస్తోంది. అయితే కిశోర్‌ది క్లాస్ జానర్. రవితేజ (Raviteja) మహా మాస్. మరి వీరిద్దరి కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందన్నది ఆసక్తిని కలిగిస్తోంది.
మరోవైపు కిషోర్ తిరుమల ‘అనార్కలీ’ (Anarkali)అనే ఓ కథని రెడీ చేశారు. ఇది రవితేజ కోసమా? లేదంటే ఇది వేరే కథా? అనేది తెలియాల్సి ఉంది. అనార్కలి టైటిల్ బాగుంది. కాకపోతే.. ఆ సౌండింగ్‌ను బట్టి చూస్తే లవ్ స్టోరీలా అనిపిస్తోంది. ఇలాంటి సాఫ్ట్ టైటిల్ రవితేజకు ససేమిరా సూట్ కాదు. కాబట్టి, ఇది పూర్తిగా వేరే సినిమా, వేరే కథ అనుకోవాలి. రవితేజ ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘మాస్ జాతర’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇది కాకుండా మరో రెండు కథలు ఫైనల్ చేశారు. అందులో మ్యాడ్ దర్శకుడు కల్యాణ్ శంకర్ కథ కూడా ఉంది. ‘మాస్ జాతర’ తరవాత కల్యాణ్ సినిమానే పట్టాలెక్కుతుందని, అది.. 2026 సంక్రాంతికి విడుదల అవుతుందని చెబుతున్నారు.