DilRuba: సినీ ప్రియులకు కిరణ్ అబ్బవరం గిఫ్ట్
ABN , Publish Date - Mar 02 , 2025 | 03:06 PM
సినీ ప్రియులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఆయన నటించిన కొత్త చిత్రం ‘దిల్‌రూబా’ (Dilruba) కథేంటో (Plot) చెబితే సినిమాలో తాను వాడిన బైక్‌ను బహుమతిగా ఇస్తానని ప్రకటించారు
సినీ ప్రియులకు బంపర్ ఆఫర్ (bumber offer) ఇచ్చారు నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఆయన నటించిన కొత్త చిత్రం ‘దిల్‌రూబా’ (Dilruba) కథేంటో (Plot) చెబితే సినిమాలో తాను వాడిన బైక్‌ను బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. అది అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. ఈ మేరకు ఆ బైక్‌ను చూపిస్తూ నేడు ప్రత్యేక వీడియో షేర్ చేశారు.
‘‘కోపం, ప్రేమల సమ్మేళనంగా తెరBike Fide) cకెక్కిన చిత్రమే ‘దిల్ రూబా’. ఈ బైక్ అంటే నాకెంతో ఇష్టం. మా ఆర్ట్ డైరెక్టర్ ఎంతో శ్రమించి సినిమా కోసం దీనిని తయారు చేశారు. మార్కెట్‌లో ఇది మీకు ఎక్కడా దొరకదు. అందుకే దీనిని మీకు బహుమతిగా ఇచ్చేయాలనుకుంటున్నా. ఈ బైక్‌ను మీ సొంతం చేసుకోవడానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. ఇప్పటివరకూ విడుదలైన మా సినిమా పాటలు, వీడియోలు, ప్రమోషన్స్‌లో మేము మాట్లాడిన విషయాలను ఆధారంగా చేసుకుని కథ ఏమిటనేది మీరు ఆలోచించి చెప్పాలి. క్రియేటివ్‌గా చెప్పిన వాళ్లకు ఈ బైక్ బహుమతిగా ఇస్తా. ఈ బైక్ గెలుచుకున్న వ్యక్తితో ఫస్ట్ డే ఫస్ట్‌షోకు వెళ్తా’’ అని కిరణ్ చెప్పారు. విశ్వకరుణ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. రుక్సర్ థిల్లాన్ కథానాయిక. మార్చి 14న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.