KIran Abbavaram: త్వరలో తండ్రి కాబోతున్నారు 

ABN , Publish Date - Jan 21 , 2025 | 10:41 AM

హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) అభిమానులకు శుభవార్త చెప్పారు. తాను తండ్రిని కాబోతున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని తెలుపుతూ మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు.

హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) అభిమానులకు శుభవార్త చెప్పారు. తాను తండ్రిని కాబోతున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని తెలుపుతూ మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. తన భార్య  రహస్యతో (Rahasya gorak) దిగిన స్పెషల్‌ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘మా ప్రేమ పెరుగుతోంది’ అని ఆ ఫొటోకు క్యాప్షన్‌ పెట్టారు. అందరి ఆశీస్సులు తమకు ఉండాలని కోరుకున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కిరణ్‌-రహస్య దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

‘రాజావారు.. రాణిగారు’ తో కిరణ్‌ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అందులో రహస్య హీరోయిన్‌గా నటించారు. ఆ మూవీ షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. తర్వాత ప్రేమగా మారింది. గతేడాది ఆగస్టులో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబసభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. గత ఏడాది ‘క’తో (KA)కిరణ్‌ అబ్బవరం సూపర్‌హిట్‌ను అందుకున్నారు.

Updated Date - Jan 21 , 2025 | 10:41 AM