Robinhood: కేతిక శర్మ హాటెస్ట్ సాంగ్ వచ్చేసింది
ABN , Publish Date - Mar 10 , 2025 | 09:36 PM
నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న 'రాబిన్ హుడ్' మూవీ ఈ నెల 28న విడుదల కాబోతోంది. ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా తాజాగా కేతికశర్మ నటించిన ఐటమ్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ అయ్యింది.
వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరో నితిన్ (Nitin) నటించిన చిత్రం రాబిన్ హుడ్ (Robinhood). ఈ సినిమా నుండి మూడో సింగిల్ 'అది ద సర్ ప్రైజ్' విడుదలైంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన రాగా ఈ థర్డ్ సింగిల్ విడుదలైన వెంటనే కుర్రకారుని కిర్రెక్కించడం మొదలు పెట్టింది.
ఈ పాట టైటిల్ కి తగినట్లుగా, కేతిక శర్మ (Ketika Sharma) పాత్ర చుట్టూ ఉన్న ఆసక్తికరమైన సంఘటనలతో సాగింది. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar) స్వరాలు సమకూర్చగా, ఐటమ్ సాంగ్ స్పెషలిస్ట్ చంద్రబోస్ (Chandra Bose) సాహిత్యం సమకూర్చారు. ఈ పాటను నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి పాడారు. విశేషం ఏమంటే... ఈ పాట చివరి చరణంలో హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల (Sreeleela) కూడా స్టెప్పులేసినట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన హాటెస్ట్ ఐటమ్ సాంగ్ గా 'అది దా సర్ ప్రైజ్' నిలుస్తుందనిపిస్తోంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన రాబిన్ హుడ్ ను వెంకీ కుడుముల డైరెక్ట్ చేశారు. మార్చి 28న మూవీ జనం ముందుకు రాబోతోంది.