Keerthy Suresh: నితిన్ ‘ఎల్లమ్మ’లో కీర్తి సురేశ్
ABN , Publish Date - Mar 23 , 2025 | 03:59 PM
భోళా శంకర్, దసరా చిత్రాల తర్వాత కీర్తి సురేశ్ తెలుగు తెరపై కనిపించలేదు. ఆమె తెలుగు సినిమాలో కనిపించి ఏడాదిన్నర పైనే అయింది. తాజా సమాచారం ప్రకారం ఆమె తెలుగు సినిమాపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది
భోళా శంకర్, దసరా చిత్రాల తర్వాత కీర్తి సురేశ్ (Keerthy suresh) తెలుగు తెరపై కనిపించలేదు. ఆమె తెలుగు సినిమాలో కనిపించి ఏడాదిన్నర పైనే అయింది. బాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను మాత్రం అలరించింది. తాజా సమాచారం ప్రకారం ఆమె తెలుగు సినిమాపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ‘బలగం’ (Balagam) చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులోనే సినీప్రియుల్ని మెప్పించారు వేణు యెల్దండి. ఆయన తదుపరి సినిమాగా నితిన్(Nithin)తో ‘ఎల్లమ్మ’ (Yellamma) పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాయికగా సాయిపల్లవి కనిపించనున్నట్లు వార్తలొచ్చినప్పటికీ.. డేట్లు సమస్యతో ఆమె తప్పుకొన్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ పాత్ర కోసం దర్శకుడు వేణు.. కీర్తి సురేశ్‌ను సంప్రదించారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర విషయమై చర్చలు కొనసాగుతున్నాయని.. కీర్తికి ఇప్పటికే కథ వినిపించారని.. త్వరలోనే ఆమె నుంచి సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇది నితిన్ - కీర్తిల కాంబోలో రెండో సినిమా అవుతుంది. వీళ్లిద్దరూ ‘రంగ్ దే’లో జంటగా నటించిన సంగతి తెలిసిందే!