Sreeleela: శ్రీలీలతో ప్రేమలో పడిన బాలీవుడ్ హీరో.. ఎవరంటే
ABN , Publish Date - Jan 04 , 2025 | 02:14 PM
బాలీవుడ్ హ్యాండ్సమ్ హాంక్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల వెనకాల పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ హీరో మూడు సార్లు ప్రేమలో ఫెయిల్ అయ్యాడు. ఇంతకీ ఈ స్టోరీ ఏంటంటే..
క్రేజీ టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల పేరు ఇప్పుడు దేశం మొత్తం మార్మోగుతోంది. దీంతో ఈ అమ్మడికి అన్ని ఇండస్ట్రీలలోను అవకాశాలు ఎగిసిపడుతున్నాయి. 24 ఏళ్ల ఈ బ్యూటీ ఎంతో మంది కుర్రకారుల హృదయాలను కొల్లగొట్టింది. అయితే మూడు సార్లు ప్రేమలో విఫలమైన ఓ స్టార్ హీరో ఆమె ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఏమైందంటే..
బాలీవుడ్ హ్యాండ్సమ్ హాంక్ కార్తిక్ ఆర్యన్.. ‘‘ఇప్పటికే మూడు సార్లు ప్రేమలో ఓడిపోయాను. కానీ ఇప్పుడు నాల్గోసారి మళ్లీ అలా జరగకూడదని కోరుకుంటున్నా’’ అంటూ తు మేరీ మై తేరా.. మై తేరా తు మేరీ’ అనే మూవీని అనౌన్స్ చేశాడు. టాలీవుడ్ ట్రెండింగ్ లో ఉన్న ఈ బ్యూటీపై ఇప్పుడు బాలీవుడ్ కన్ను పడినట్లు తెలుస్తోంది. కార్తీక్ కి జోడిగా శ్రీలీల ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సమీర్ విద్వాన్స్ తెరకెక్కిస్తుండగా.. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇదొక కంప్లీట్ లవ్ స్టోరీగా తెరకెక్కనుంది. ఈ వార్తను అఫీషియల్ గా ప్రకటించడం ఒకటే బాకీ అని సమాచారం. శ్రీలీల బాలీవుడ్ డెబ్యూపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
ప్రస్తుతం ఆమె సిద్దు జొన్నలగడ్డ, రవితేజలతో సితార బ్యానర్ లో రెండు సినిమాలు సైన్ చేశారు. అఖిల్ అక్కినేనితో మరో సినిమాని ఆమె సితార బ్యానర్ లో సైన్ చేశారు. ఈ సినిమాకి వినరో భాగ్యము విష్ణుకథ సినిమా డైరెక్టర్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాని సితారతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అలాగే నాగ చైతన్యతో విరూపాక్ష డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా శ్రీలీలే యాక్ట్ చేయనుంది. ఏది ఏమైన 'కిస్సిక్' సాంగ్ తో శ్రీలీల కెరీర్ లో మళ్ళీ జోష్ పెరిగింది.