Shartu: ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే టీజర్...
ABN , Publish Date - Mar 28 , 2025 | 03:03 PM
శ్రతు ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'కర్మణ్యే వాధికారస్తే'. కర్తవ్యమే దైవంగా భావించే పోలీసు బృందం నేరప్రపంచంపై ఎక్కుపెట్టిన పాశుపతాస్త్రం ఈ చిత్రం.
వర్తమాన నేర ప్రపంచంలో జరుగుతున్న ఘటనల ఆధారంగా వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'కర్మణ్యే వాధికారస్తే' (Karmanye Vadhikaraste). ఈ నేర ప్రపంచంలో జరిగే ఉదంతాలను కర్తవ్యమే దైవంగా భావించే ఒక పోలీసు అధికారుల బృందం ఏవిధంగా ఎదుర్కొంది అనేది ఈ సినిమా కథాంశం. అమర్ దీప్ చల్లపల్లి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డి.ఎస్.ఎస్. దుర్గా ప్రసాద్ దీనిని నిర్మించారు. శత్రు (Shatru), బ్రహ్మాజీ (Brahmaji), 'మాస్టర్' మహేంద్రన్ ('Master' Mahendran) ప్రధాన పాత్రల్లో పోషించిన ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలను పృథ్వీ, శివాజీ రాజా, శ్రీసుధా, బెనర్జీ, అజయ్ రత్నం తదితరులు చేశారు. ఐరా దయానంద్ రెడ్డి ఈ చిత్రంతో పరిచయమవుతున్నారు.
విశాఖపట్నం, హైదరాబాద్ లలో చిత్రీకరణ జరుపుకున్న 'కర్మణ్యే వాధికారస్తే' చిత్రం ప్రస్తుతం ప్రసాద్ ఫిలిం ల్యాబ్, సారధి స్టూడియోస్ లో నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవుతోంది. తాజాగా ఈ విభిన్నమైన యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి విడుదలైన టీజర్ ఉత్కంఠభరితంగా నిలిచి సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. శివకుమార్ పెళ్ళూరు కథ, సంభాషణలు సమకూర్చిన ఈ సినిమాకు గ్యానీ సంగీతం అందించారు.
Also Read: L2: Empuraan: అభిమన్యు సింగ్ పాత్రపై హిందువుల ఆగ్రహం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి