Kannappa Warning: శివుడి ఆగ్రహానికి.. శాపానికీ.. గురవుతారు.. గుర్తుపెట్టుకోండి.

ABN , Publish Date - Mar 24 , 2025 | 04:38 PM

కన్నప్ప సినిమాను ట్రోల్ చేసే వారికి టీం వార్నింగ్ ఇచ్చింది. ట్రోల్ చేసిన వారు శాపానికి గురవుతారని చెప్పారు 

మంచు విష్ణు (Manchu Vishnu) కన్నప్ప (Kannappa) ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు. ఇందులో భాగంగా వరుసగా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆయనకు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొస్తున్నారు. తాజాగా ఆయన ట్రోలర్స్‌, ట్రోలింగ్‌ గురించి మాట్లాడారు. సోషల్‌మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ప్రజలకు అన్నీ తెలుసని అన్నారు. ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ (Mukesh Kumar Singh) దర్శకత్వంలో రూపొందుతున్నఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా ‘బుక్‌ మై షో’ ఆధ్వర్వంలో జరిగిన రెడ్‌ లారీ ఫిలిం ఫెస్టివల్‌లో విష్ణు మాట్లాడారు.  ‘కన్నప్ప’ కోసం న్యూజిలాండ్‌లో 9 వేల ఎకరాల ఫాంను ఆరు నెలలకు అద్దెకు తీసుకున్నట్లు విష్ణు చెప్పారు. అక్కడ షూటింగ్‌ చేస్తుండగానే తనకు డ్రోన్‌ తగిలి గాయమైందని సెట్‌లో వాళ్లంతా  కంగారుపడుతుంటే, తనకు గాయమైన విషయం తన తండ్రి మోహన్‌బాబుకు చెప్పొద్దని ఆస్పత్రికి వెళ్లినట్లు వివరించారు.


‘మీరు మొదటి నుంచి చాలా తెలివిగా మాట్లాడతారు. కానీ, కొంతమంది వాటిని ట్రోల్‌ చేస్తూ ఉంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ బాడీ గురించి మాట్లాడినప్పుడు కూడా ట్రోల్‌ చేశారు. అసలు ఈ ట్రోలింగ్‌ గురించి మీ స్పందన ఏంటి అని విష్ణుని అడడగా ఆయన స్పందించారు. ‘నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా ఒక వాక్యం కట్‌ చేసి వైరల్‌ చేసి వివాదం సృష్టించాలనుకుంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు చాలా స్మార్ట్‌. కొంచెం వివాదమైన పూర్తి వీడియోను చూసి నిజమేంటో తెలుసుకుంటారు. ఆ తర్వాత న్యూసెన్స్‌ అనుకుంటున్నారు’ అని విష్ణు సమాధానమిచ్చారు. ఆ వేదికపైనే ఉన్న నటుడు రఘుబాబు మైక్‌ అందుకుని, ట్రోల్స్‌పై కాస్త ఘాటుగానే స్పందించారు. ‘ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్స్‌ చేస్తే శివుడి ఆగ్రహానికి, శాపానికీ గురవుతారు. గుర్తుపెట్టుకోండి. 100 శాతం కచ్చితంగా చెబుతున్నా. ట్రోల్‌ చేస్తే ఇక ఫినిష్‌’ అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  ‘మహాభారతం’ సీరియల్‌ ఫేమ్‌ ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ ‘కన్నప్ప’కు దర్శకత్వం వహించారు. ఏప్రిల్‌ 25న సినిమా విడుదల కానుంది. 

Updated Date - Mar 24 , 2025 | 04:38 PM