Kannappa: నెక్స్ట్ సోమవారం ప్రభాస్‌దే.. మహా శివుడి ఆగమనం
ABN , Publish Date - Jan 20 , 2025 | 01:27 PM
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్న'ప్ప మూవీ నుండి ఇప్పటికే ప్రభాస్ లుక్ ఇంటర్నెట్‌లో లీక్ అయినా విషయం తెలిసిందే. అయితే..
మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ‘మహాభారత’ సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Singh) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ప్రీతి ముకుందన్ కథనాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎంతోమంది అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మూవీలో శివుడి పాత్రలో నటిస్తున్న.. అక్షయ్ కుమార్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ లుక్ ఎలా ఉందంటే..
'ముల్లోకాలను ఏలే పరమేశ్వరుడు.. భక్తికి మాత్రం దాసుడు’ అంటూ మహా శివుడిని కీర్తిస్తూ అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నాట్యం ఆడుతున్న పోస్టర్‌ని 'కన్నప్ప' రిలీజ్ చేసింది.
రూ. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం నుండి ప్రతి సోమవారం కొత్త అప్డేట్స్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాల కీలక పాత్రల్లో నటిస్తున్న మంచు విష్ణు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఇక నంది పాత్రలో నటిస్తున్న ప్రభాస్ లుక్ మాత్రమే రిలీజ్ చేయాల్సి ఉంది. ఈ లుక్ కూడా అతి త్వరలోనే ఎదో ఒక సోమవారం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ప్రభాస్ లుక్ ఇంటర్నెట్‌లో లీక్ అయినా విషయం తెలిసిందే.
ఈ సినిమాకి స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రం అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రానికి మోహన్‌బాబు నిర్మాతగా వ్యవహరించడంతోపాటు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.