RC 16: 'ఆర్‌సీ 16'లో చిరంజీవి సర్జా భార్య
ABN , Publish Date - Mar 17 , 2025 | 05:56 PM
కన్నడ దివంగత నటుడు చిరంజీవి సర్జా సతీమణి, నటి మేఘనా రాజ్ 'ఆర్‌సీ 16'లో భాగమైనట్లు వార్తలు వసున్నాయి. ఇందులోని ఓ కీలక పాత్ర కోసం టీమ్ ఆమెను సంప్రదించిందని సమాచారం.
రామ్ చరణ్ (Ram charan) హీరోగా బుచ్చిబాబు (Buchibabu Sana) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ‘ఆర్‌సీ 16’ (RC 16) వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కన్నడ దివంగత నటుడు చిరంజీవి సర్జా సతీమణి, నటి మేఘనా రాజ్ (Meghana Raj) భాగమైనట్లు వార్తలు వసున్నాయి. ఇందులోని ఓ కీలక పాత్ర కోసం టీమ్ ఆమెను సంప్రదించిందని సమాచారం. పాత్ర నచ్చడంతో మేఘనా కూడా అంగీకరించారని టాక్. ఈ మేరకు ఆమె చిత్రీకరణలో భాగమయ్యారని సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై టీమ్ నుంచి లేదా ఆమె నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
స్పోర్ట్స్ నేపథ్యంలో ఆర్‌సీ 16 సిద్ధమవుతోంది. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు చేస్తున్న చిత్రమిది. ఇందులో రామ్‌చరణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుంది. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. శివ రాజ్‌కుమార్‌తోపాటు జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు.
మేఘన భర్త చిరంజీవి సర్జా కరోనా సమయంలో గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. భర్త మరణం తర్వాత ఆమె తిరిగి కెరీర్‌పై దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ‘‘నటనంటే నాకెంతో ఇష్టం. అది నా రక్తంలోనే ఉంది. నా భర్త చిరంజీవి సర్జా, నాకు ఇష్టమైనదేదీ వదులుకోవద్దని, నటించమని చెప్పేవారు. అందుకే నేను ఉన్నంతవరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. తప్పకుండా సినిమాల్లోకి తిరిగి వస్తా’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.