Dil Ruba: లవ్ వైబ్రేషన్ తో సాగిన 'కన్నా... నీ ప్రేమ సంద్రమే' గీతం

ABN , Publish Date - Mar 01 , 2025 | 12:27 PM

దీపావళి కానుకగా 'క' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు హోలీ పండగను టార్గెట్ చేశాడు. మార్చి 14న అతని తాజా చిత్రం 'దిల్ రూబా' విడుదల కాబోతోంది.

'క' సినిమాతో చక్కని విజయాన్ని అందుకున్న కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు. అంతేకాదు... రెట్టించిన ఉత్సాహంతో సరికొత్త ప్రేమకథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అలా రూపుదిద్దుకుంటున్న చిత్రమే 'దిల్ రూబా' (Dil Ruba). రుక్సర్ థిల్లాన్ (Rukshar Dhillon) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను రవి, జోజో జోస్, రాకేశ్‌ రెడ్డి, సారెగమ ప్రొడ్యూస్ చేస్తున్నారు. విశ్వ కరుణ్ ఈ మూవీకి డైరెక్టర్.


తాజాగా 'దిల్ రూబా' నుండి ఓ పెయిన్ ఫుల్ మెలోడీని మేకర్స్ రిలీజ్ చేశారు. ' కన్నా నీ ప్రేమ సంద్రమే, నేను నీ తీరమే, కన్నా నువ్వు నా ప్రాణమే, నేను నీ దేహమే, అలలుగా తాకగానే, కరిగిపోనా నీలో, ప్రళయమై తాండవిస్తే, అలజడే నాలో ..' అంటూ గుండె లయనే అక్షరాలుగా మార్చి ఈ పాటను భాస్కరభట్ల రవికుమార్ రాశారు. లవ్ వైబ్రేషన్ తో సాగే ఈ పాటను హృదయానికి హత్తుకునే రీతిలో సామ్ సీఎస్ (Sam CS) అద్భుతమైన బాణీని సమకూర్చారు. దీనిని సత్యప్రకాశ్‌, మాళవిక సుందర్ పాడారు. మార్చి 14న హోలీ సందర్భంగా 'దిల్ రూబా' మూవీ జనం ముందుకు రాబోతోంది.

Also Read: Progress Report: ఫిబ్రవరి మాసం 'తండేల్' చిత్రానిదే!

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 01 , 2025 | 01:02 PM