Kalyan Shankar: దర్శకులు మారారు అంతే.. మిగతాదంతా సేమ్ టు సేమ్..
ABN , Publish Date - Mar 01 , 2025 | 07:33 PM
ప్రస్తుతం కాలంలో ఓ సినిమా హిట్టయితే సీక్వెల్ చేయడం కామన్ అయిపోయింది. పార్టులుగా తీసే ఏ సినిమాకు అయినా అదే టీమ్ పని చేస్తుంటుంది. దర్శకుడు, హీరో మారడం సాధారణంగా జరగదు.
ప్రస్తుతం కాలంలో ఓ సినిమా హిట్టయితే సీక్వెల్ చేయడం కామన్ అయిపోయింది. పార్టులుగా తీసే ఏ సినిమాకు అయినా అదే టీమ్ పని చేస్తుంటుంది. దర్శకుడు, హీరో మారడం సాధారణంగా జరగదు. అయితే ‘టిల్లు’, ‘హిట్’ చిత్రాల విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. డీజే టిల్లు చిత్రానికి విమల్ కృష్ణ (Vimal Krishna0 దర్శకుడు. సిద్దు జొన్నలగడ్డని (Siddhu Jonnalagadda) స్టార్‌బోయ్‌గా మార్చిన సినిమా ఇది. దర్శకుడిగా విమల్‌కు మంచి పేరొచ్చింది. అయితే టిలు స్క్వేర్ దగ్గరకు వచ్చే సరికి దర్శకుడు మారిపోయాడు. విమల్ స్థానంలో మల్లిక్ రామ్ (Malik Ram) వచ్చాడు. దర్శకుడు మారినా ఫలితం మారలేదు. తొలి సినిమా కంటే సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్వ్కేర్ పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు టిల్ల్లు క్యూబ్ రాబోతోంది. ఈసారి కూడా దర్శకుడు మారాడు. మల్లిక్ రామ్ స్థానంలో కల్యాణ్ శంకర్ (Kalyan Shankar) వచ్చాడు.
ఇప్పుడు 'టిల్లు క్యూబ్’ (Tillu Cube) దర్శకుడు కల్యాణ్ శంకర్ అని నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటన చేశారు. ‘మాడ్’ సినిమాతో డైరెక్టర్‌గా హిట్‌ను తన ఖాతాలో హిట్ వేసుకొన్నాడు కల్యాణ్ శంకర్. ఇప్పుడు మ్యాడ్ 2 తీస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ అదరగొట్టింది. కామెడీ ఈసారి మరింత బాగా పండిందన్న విషయం అర్థం అవుతోంది. మాడ్ తరవాత కల్యాణ్‌కు మంచి అవకాశాలొచ్చాయి. రవితేజతో కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడని చెప్పుకొన్నారు. అంతకంటే ముందుగా టిల్లు క్యూబ్‌కి ఫిక్సయిపోయాడు. దర్శకుడిగా ఇది అతనికి మంచి ఆఫర్. సిద్దు జొన్నలగడ్డ ఫామ్‌లో ఉన్న హీరో. తనతో ఓ హిట్ కొడితే కల్యాణ్ రేంజే మారిపోతుంది. టిల్లుది ఒక రూట్ అయితే ఒక దారైతే హిట్ ది మరొక దారి. హిట్ దర్శకుడు శైలేష్ కొలను. హిట్ 2, హిట్ 3కి కూడా ఆయనే. కాకపోతే.. ఆ సినిమాలో పని చేసే హీరోలే మారారు. అడవిశేష్, విశ్వక్‌సేన్, నాని.. ఇలా హిట్ సినిమాలో కనిపించే హీరోలు మారుతున్నారు. టిల్లులో దర్శకులు మారుతున్నారు. ఇదే డిఫరెన్స్.