Kalyan Ram: అర్జున్ సన్నాఫ్ వైజయంతిగా కళ్యాణ్ రామ్

ABN , Publish Date - Mar 08 , 2025 | 07:09 PM

నందమూరి కళ్యాణ్ రామ్, సాయి మంజ్రేకర్ జంటగా నటిస్తున్న సినిమా టైటిల్ ను ఖరారు చేశారు. అంతేకాదు... మహిళాదినోత్సవం సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ నూ రిలీజ్ చేశారు మేకర్స్.

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) నటిస్తున్న 21వ చిత్రం టైటిల్ ను మహిళాదినోత్సవం సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. విజయశాంతి (Vijaya Shanthi) ఐపీఎస్ అధికారిణిగా కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ఆమె తనయుడిగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. తెలుగులో పోలీస్ ఆఫీసర్ పాత్ర అనగానే ఠక్కున గుర్తొచ్చేది విజయశాంతినే. 'కర్తవ్యం' (Karthavyam) సినిమాలో పోషించిన వైజయంతి అనే పోలీస్ పాత్ర ఆమెకు ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. దాంతో ఇప్పుడీ సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్రకూ వైజయంతి అనే పెట్టారు. తాజాగా ఈ చిత్రానికి 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' (Arjun S/o Vyjayanthi) అనే టైటిల్ ను ఖరారు చేశారు. అలానే ఫస్ట్ లుక్ పోస్టర్ నూ విడుదల చేశారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక్ వర్థన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఈ పోస్టర్ కళ్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలని ఇంటెన్స్ డైనమిక్ గా ప్రజెంట్ చేస్తోంది. మండుతున్న జ్వాలల మధ్య దృఢ సంకల్పంతో నడుస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఫ్యాక్టరీ లాంటి వాతావరణం, చెల్లాచెదురుగా ఉన్న ఇనుప గొలుసులు ఇంటన్సిటీని పెంచుతున్నాయి. మ్యాసీవ్ హ్యాండ్ కప్స్ పాత్రలను కలుపుతున్నాయి, వారి బాండింగ్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాయి. కళ్యాణ్ రామ్ రా పవర్, కళ్ళులో ఇంటన్సిటీతో అదరగొట్టారు. విజయశాంతి ఖాకీ దుస్తులలో ఆజ్ఞాపిస్తూ కనిపించారు. పోస్టర్ ఫెరోషియస్ వైబ్‌ను మరింత పెంచుతుంది. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ ను పూర్తి చేసిన మేకర్స్ త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఈ టైటిల్, ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకున్నాయి. సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సోహైల్ ఖాన్ (Sohail Khan) విలన్ పాత్రలో నటిస్తున్నారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ (Ajaneesh Loknath) సంగీతం సమకూర్చారు.

Also Read: Radhika Apte: మెగా ఫోన్ పడుతున్న వివాదాస్పద నటి

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 09 , 2025 | 04:00 AM