Thandel Review: తండేల్ చూసి దర్శకేంద్రుడు ఏమన్నారంటే..
ABN , Publish Date - Feb 09 , 2025 | 12:09 PM
నాగచైతన్య9Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ (Thandel) చిత్రాన్ని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. సినిమాపై తన ఒపీనియన్ చెబుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
నాగచైతన్య9Naga Chaitanya), సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ (Thandel) చిత్రాన్ని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. సినిమాపై తన ఒపీనియన్ చెబుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. తండేల్ సినిమా తనకెంతో నచ్చిందని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. "ఎంతోకాలం తర్వాత మనసును హత్తుకునే మంచి ప్రేమకథా చిత్రాన్ని తాను వీక్షించాను. నాగ చైతన్య(Naga chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) పోటీ పడి నటించారు. చందూ మొండేటి (Chandoo mondeti) తీసుకున్న కథ.. దాని నేపథ్యం సాహసోపేతమే. షాట్ మేకింగ్‌పై దర్శకుడి శ్రద్థ బాగుంది. ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్న గీతా ఆర్ట్స్‌కు (Geetha arts) అభినందనలు. ఒక్క మాటలో ఇది ఒక దర్శకుడి సినిమా!’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. (K raghavendra rao review on Thandel)
దర్శకుడు రాఘవేంద్రరావు నుంచి ప్రశంసలు రావడంపై నాగచైతన్య ఆనందం వ్యక్తం చేశారు. ‘‘థాంక్యూ సో మచ్ సర్. మీ మాటలు నాకెంతో విలువైనవి. మీకు మా సినిమా నచ్చినందుకు సంతోషం’’ అని రిప్లై ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు వేటకు వెళ్లగా.. పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఘటన ఇతివృత్తంగా ఈ కథ సిద్ధమైంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండేల్ రాజుగా చైతన్య, సత్యగా సాయి పల్లవి తమ నటనతో ప్రేక్షకుల మదిని గెలుచుకున్నారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో చైతన్య తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఎమోషన్‌కి గురి చేశారు. ఆయా సన్నివేశాలు కన్నీరు పెట్టించాయి. ఆ వీడియోలు నెట్టింట వైరల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ పోస్టర్ విడుదల చేసి తెలిపింది.