Jr Ntr: వర్ధంతి వేళ.. తాతకు నివాళి
ABN , Publish Date - Jan 18 , 2025 | 07:06 AM
నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకొని ఏం చేసారో తెలుసా
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులి అర్పించారు.
ఘాట్ వద్ద కాసేపు కింద కూర్చున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ తాతను స్మరించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వచ్చారు.