Devara: జపాన్‌లో తారక్ సందడి మామూలుగా లేదు..
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:41 PM
‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR) సినిమాతో తారక్‌కు జపాన్‌లో ఫాలోయింగ్ బాగా పెరిగింది. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు చూస్తుంటే తారక్ అంటే పడి చచ్చేంత అభిమానం అక్కడివారు చూపిస్తున్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR) సినిమాతో తారక్‌కు జపాన్‌లో ఫాలోయింగ్ బాగా పెరిగింది. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు చూస్తుంటే తారక్ అంటే పడి చచ్చేంత అభిమానం అక్కడివారు చూపిస్తున్నారు. తాజాగా అక్కడి లేడీ ఫ్యాన్ ఫాలోయర్స్ తారక్ (Jr Ntr) కటౌట్ పెట్టి సెలబ్రేషన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కి జపాన్లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో ‘దేవర’ (Devara)సినిమాను జపాన్‌లో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను భారీ ఎత్తున విడుదలకు ప్లాన్ చేశారు. మార్చి 28న 'దేవర' సినిమా జపాన్‌లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. మొదటి రోజు ప్రమోషన్స్‌లో భాగంగా ప్రివ్యూ థియేటర్‌లో అభిమానులతో కలిసి సందడి చేశారు. థియేటర్‌లో సినిమాలోని ఆయుద పూజ సాంగ్‌కి డాన్స్ చేశారు. (Devara Release in Japan)
ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానుల ఉత్సాహం చూసి తారక్ మరింత ఉత్సాహంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. రెండో రోజు ప్రమోషన్స్‌లో తారక్ స్టైలిష్, కూల్ లుక్‌లో సర్‌ప్రైజ్ చేశారు. ఈ ఫొటోలు చూస్తుంటే తారక్ బరువు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ప్రశాంత్ నీల్, వార్-2 చిత్రాల కోసం తారక్ బరువు తగ్గి స్లిమ్ అయినట్లు తెలుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా జపాన్‌లో భారీ విజయం సొంతం చేసుకుంది. వంద రోజులకు పైగా ప్రదర్శింపబడ్డ ఆ సినిమా హాలీవుడ్ సినిమాల స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్' వసూళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేేస విధంగా దేవర సినిమాను విడుదల చేయబోతున్నారు. పెద్దగా పోటీ లేక పోవడంతోపాటు ఎక్కువ స్ర్కీన్స్‌లో సినిమాను విడుదల చేయబోతున్న కారణంగా దేవర సినిమా కచ్చితంగా జపాన్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.