JR NTR: తారక్‌తో షూటింగ్‌ ఫిక్స్‌.. ఎప్పుడు.. ఎక్కడ..

ABN , Publish Date - Feb 17 , 2025 | 10:33 AM

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) హీరోగా కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) హీరోగా కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే! మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పనులు చకచకా ముందుకెళ్తున్నాయి. వచ్చే వారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలిసింది. అయితే ఈ షెడ్యూల్‌లో తారక్‌ లేని సన్నివేశాలు చిత్రీకరిస్తారట. మార్చి నుంచి తారక్‌ సెట్స్‌లో అడుగుపెడతారట.

ప్రస్తుతం ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఓల్డ్‌ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను సిద్థం చేస్తున్నారు. అందులోనే రెండో షెడ్యూల్‌ మొదలు కానుంది.  పీరియాడిక్‌ మాస్‌ యాక్షన్‌ డ్రామాలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్‌ కనిపించనుంది. మలయాళ నటుడు టొవినో థామస్‌ కీలక పాత్ర పోషించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు.


ఇక ఎన్టీఆర్‌ విషయానికొస్తే.. దేవర తర్వాత ఆయన హిందీ చిత్రం వార్‌-2పై ఫోకస్‌ పెట్టారు. అందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ముంబైలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.


Updated Date - Feb 17 , 2025 | 10:33 AM