Exclusive: రాజమౌళి సినిమాలో ఆ నటుడు..
ABN , Publish Date - Jan 29 , 2025 | 09:48 PM
Exclusive: రాజమౌళి, మహేష్ బాబు 'SSMB 29'లో పలువురు నటులు నటించనున్నట్లు అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే 'SSMB 29' ప్రొడ్యూసర్, దుర్గ బ్యానర్స్ అధినేత KL నారాయణ చిత్రజ్యోతితో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ.. క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో కాస్టింగ్ పై చర్చ జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కో ఊహాగానాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. కొందరు ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నట్లు రాయగా, మరికొందరు బాలీవుడ్ బ్యాడ్ బాయ్.. జాన్ అబ్రహాం ఆ పాత్రను చేస్తున్నట్లు రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే 'SSMB 29' ప్రొడ్యూసర్, దుర్గ బ్యానర్స్ అధినేత KL నారాయణ చిత్రజ్యోతితో ఎక్స్‌క్లూజివ్ గా మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
బుధవారం 'SSMB 29' సినిమా కాస్టింగ్ పై విభిన్నమైన వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ పాత్రలో మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు రాగా.. ఈ సినిమా ప్రాజెక్ట్ నుండి పృథ్వీరాజ్ తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. అలాగే ఆ పాత్రను బాలీవుడ్ బ్యాడ్ బాయ్.. జాన్ అబ్రహం చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రొడ్యూసర్ చిత్రజ్యోతితో ఎక్స్‌క్లూజివ్ గా మాట్లాడుతూ.. 'జాన్ అబ్రహాం ఈ మూవీలో నటిస్తున్నారు అనే వార్తలో నిజం లేదని తేల్చి చెప్పారు'. దీంతో ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ వచ్చింది.
దీంతో పృథ్వీరాజ్ సుకుమారన్ ఫ్యాన్స్ ఖుషీగా ఫీల్ అవుతున్నారు. వాస్తవానికి నటన పరంగా, క్రియేటివ్ టెక్నీషియన్ గా పృథ్వీరాజ్ కు మంచి పేరుంది. అలాగే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ‘‘నాకంటే మీకే చాలా విషయాలు తెలిశాయి. ఇంకా ఏదీ స్పష్టత రాలేదు. చర్చలు జరుగుతున్నాయి. అవి ఫైనల్ అయ్యాక దీని గురించి మాట్లాడుకుందాం’’ అన్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ లో పృథ్వీ ఉంటాడనే ఆశాభావం వ్యక్తం అవుతుంది.