Jayaprada: జయప్రద ఇంట విషాదం
ABN , Publish Date - Feb 28 , 2025 | 06:47 PM
ప్రముఖ నటి - మాజీ రాజ్యసభ, లోక్ సభ సభ్యురాలు జయప్రద ఇంట విషాదం చోటు చేసుకుంది.
ప్రముఖ నటి - మాజీ రాజ్యసభ, లోక్ సభ సభ్యురాలు జయప్రద (Jayaprada) సోదరుడు రాజబాబు (Rajababu-65) శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందారు. "రాజమండ్రి రోమియోలు, 'బోరింగ్ పాప' వంటి చిత్రాల్లో హీరోగా నటించి, నిర్మించిన రాజబాబు నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ... అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు.