Jani Master: కౌంటర్‌కు.. రీ కౌంటరు
ABN , Publish Date - Jan 31 , 2025 | 09:39 PM
Jani Master: ఇటీవల జానీ మాస్టర్ తన భార్య సుమలత అలియాస్ అయేషాతో కలిసి ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అనంతరం సదరు బాధితురాలు కూడా మీడియా ముందుకు వచ్చి జానీ మాస్టర్, ఆయన వాదనలను తీవ్రంగా కొట్టి పడేశారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించిన జానీ మాస్టర్ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయినా ఇరు వర్గాలు కోర్టు బయటే ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇటీవల జానీ మాస్టర్ తన భార్య సుమలత అలియాస్ అయేషాతో కలిసి ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అనంతరం సదరు బాధితురాలు కూడా మీడియా ముందుకు వచ్చి జానీ మాస్టర్, ఆయన వాదనలను తీవ్రంగా కొట్టి పడేశారు. తాజాగా మరోసారి బాధితురాలి కామెంట్స్ పై జానీ మాస్టర్ వైఫ్ అయేషా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో బాధితురాలు మాట్లాడుతూ.. 'జానీ మాస్టర్ నన్ను ఇండస్ట్రీకి తీసుకురాలేదు. నేను స్వశక్తితో పైకొచ్చాను. . జానీ మాస్టర్ కు క్యారెక్టర్‌లెస్' అంటూ తీవ్రంగా మండిపడింది. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ భార్య కౌంటర్ ఇస్తూ.. " నా భర్తపై నువ్వు మనసు పడ్డావ్, అందుకే నిన్ను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా తొలిగించాం. ఆరేళ్లు నా భర్త లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె చెబుతోంది. రెండేళ్లుగా జానీతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. ఆమెను మేం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా తొలిగించి, దూరం పెట్టాం. అలాంటిది ఇప్పుడామె జానీపై ఫిర్యాదు చేయడం ఏంటి? ఆమె ఉద్దేశం ఏంటో ఇక్కడే తెలిసిపోతోంది కదా. కేవలం నా భర్తను ఇబ్బంది పెట్టడం కోసమే ఆమె ఇలా వ్యవహరిస్తోంది. లైంగిక వేధింపులు చేశాడనేది పూర్తిగా అవాస్తవం. శ్రేష్టికి అసోసియేషన్ లో సభ్యత్వం ఇప్పించి, ఆమె చెల్లెలి చదువు కోసం కూడా సహాయం చేసిన జానీ మాస్టర్ పై కేసు పెట్టాలని ఆమెకు ఎలా అనిపించిందని" అంటూ ప్రశ్నిచింది.
ఏం జరిగిందంటే..
తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో జానీ మాస్టర్ జైలుకి కూడా వెళ్లారు. రీసెంట్‌గా బెయిల్‌పై బయటికి వచ్చారు. జానీ మాస్టర్‌పై ఆరోపణలు చేసిన లేడీ కొరియోగ్రాఫర్ ఫిల్మ్ ఛాంబర్‌లోనూ ఆయనపై ఫిర్యాదు చేసింది. ఫిల్మ్ చాంబర్ ఆదేశాల మేరకు డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుండి జానీ మాస్టర్‌ని తొలగించి, వెంటనే ఎన్నికలు నిర్వహించారు. దీనిపై జానీ మాస్టర్ కోర్టులో పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్‌ని కోర్టు కొట్టివేసినట్లుగా తెలుస్తోంది.