RC 16: చరణ్ కోసం బాబుని సాన పెడుతున్న బాబు
ABN , Publish Date - Jan 16 , 2025 | 03:17 PM
RC 16: ఒక గేమ్ బేస్డ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని రక్తి కట్టించేలా బుచ్చిబాబు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగపతి బాబు ఆసక్తికర వీడియోని షేర్ చేశాడు.
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సాన (Sana Buchibabu) 'ఆర్‌సీ16’ (RC 16) వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్థి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీకపూర్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగపతి బాబు ఆసక్తికర వీడియోని షేర్ చేశాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో తన పాత్ర మేక్ ఓవర్ కి సంబంధించిన ఓ వీడియోని షేర్ చేస్తూ జగపతి బాబు.. ‘‘చాలాకాలం తర్వాత బుచ్చిబాబు ఆర్‌సీ 16 కోసం మంచి పని పెట్టాడు. గెటప్ చూసిన తర్వాత నాకు చాలా తృప్తిగా అనిపించింది’’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియోలో జగపతి బాబు లుక్ ని చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతూ కామెంట్స్ పెడుతున్నారు.
ఒక గేమ్ బేస్డ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని రక్తి కట్టించేలా బుచ్చిబాబు రూపొందిస్తున్నారు. మట్టి లాంటి కథ ఇదని ఇప్పటికే రామ్‌చరణ్ చెప్పారు. ఇప్పటి వరకూ చేసిన చిత్రాలో ఈ చిత్రం ది బెస్ట్ అవుతుందని కూడా ఆయన ఓ వేదికపై వెల్లడించారు. ఉప్పెనతో భారీ విజయం అందుకుని నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సాన బుచ్చిబాబు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పూర్తిస్థాయి కథతో పకడ్భందీగా సెట్స్ మీదకెళ్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కాగా 'గేమ్ ఛేంజర్' సినిమా చెర్రీ ఫ్యాన్స్ ని కాస్త నిరాశపరచడంతో అందరు ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.