Siddhu Jonnalagadda: జాక్ టీమ్ లోకి సామ్ సి.ఎస్.
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:48 AM
సిద్ధు జొన్నలగడ్డ తాజా చిత్రం 'జాక్'కు అచ్చు రాజమణి స్వరాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకు సామ్ సీ.ఎస్. నేపథ్య సంగీతం అందిస్తున్నారు.
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) ప్రస్తుతం మూడు చిత్రాలు చేస్తున్నాడు. అందులో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అందులో ఒకటి 'జాక్' (JACK) కాగా మరొకటి 'తెలుసు కదా'. ఈ రెండు సినిమాల తర్వాత సిద్ధు 'కోహినూర్' అనే మరో చిత్రాన్ని చేయబోతున్నాడు. ఇక 'టిల్లు క్యూబ్' మూవీ ఉండనే ఉంది. అయితే... సిద్ధు జొన్నలగడ్డ తాజా చిత్రం 'జాక్'కు సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'జాక్' మూవీని బీవీఎస్ఎన్ ప్రసాద్ (BVSN Prasad) నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అచ్చు రాజమణి స్వరాలు సమకూర్చుతున్నాడు. తాజాగా ఈ సినిమా రీ-రికార్డింగ్ కు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ (Sam CS) ను ఎంపిక చేశారు. 'పుష్ప-2' సినిమాకు సైతం సామ్ సీఎస్ పనిచేసిన విషయం తెలిసిందే. అలానే సామ్ సీఎస్ సంగీతం అందించిన 'దిల్ రూబా' మార్చి 14న విడుదల కానుంది. ఈ సినిమాలో సిద్దు సరసన వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా నటిస్తోంది.
బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దూసుకుపోతోన్న సంగీత దర్శకుడు శామ్ సీఎస్ 'జాక్' సినిమాలో సిద్దుని ఏ రేంజ్‌లో ఎలివేట్ చేస్తారా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మేకర్లు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ (Prakash Raj), నరేష్ (Naresh), బ్రహ్మాజీ (Brahmaji) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది.
Also Read: Jyothi Poorvaj: కిల్లర్ హీరోయిన్ కు కర్ణాటక స్టేట్ అవార్డ్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి