Dil Raju: దాడుల వెనుక ఆ కోణం.. 'గేమ్ ఛేంజర్'లుగా మారిన ఐటీ అధికారులు.
ABN , Publish Date - Jan 23 , 2025 | 09:26 AM
Dil Raju: మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్న దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, సుకుమార్‌లనే కాకుండా మరో 15 మంది ప్రముఖల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. అయితే తెరపైకి మరో కోణం వెలుగులోకి రావడంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది.
మంగళవారం తెల్లారుజామున మొదలైన ఐటీ సోదాలు ఇంకా ముగియలేదు. మూడు రోజుల నుండి ఐటీ అధికారులు సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖ నిర్మాతలు, నిర్మాణ సంస్థల కార్యాలయాలు, ఇళ్లల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్న దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, సుకుమార్‌లనే కాకుండా మరో 15 మంది ప్రముఖల ఇళ్లు, కార్యాలయాలపై దాడి జరుపుతున్నారు
దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా, సుకుమార్ పేర్లు మీడియాలో బలంగా వినిపిస్తున్న మరికొందరు సినీ నిర్మాతలు, ఫైనాన్షియర్స్ పై దాడులు కొనసాగుతున్నాయి. అధికారులు సుదీర్ఘంగా నిర్మాణ సంస్థలకు చెందిన బ్యాంక్ అకౌంట్లు, స్థిర చర ఆస్తులను పరిశీలిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ మొదలగు ఆఫీసులపై దాడులు జరిగాయి. అయితే ఈ సంస్థలలో విదేశీ పెట్టుబడులపై అధికారులు స్పెషల్ ఫోకస్ చేసినట్లు సమాచారం. కాగా గురువారంతో సోదాలు ముగిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నారు. సంక్రాంతికి భారీ బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించిన నేపథ్యంలో దిల్ రాజు నివాసంలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం.. సినిమాల నిర్మాణానికి భారీగా వెచ్చించినట్లు చెబుతున్నారు. ఈ రెండు చిత్రాల కలెక్షన్ల నేపథ్యంలో తనిఖీలకు ప్రాధాన్యం సంతరించుకొంది.