IT Raids: సుకుమార్‌కి షాకిచ్చిన ఐటీ అధికారులు.. కొనసాగుతున్న దాడులు

ABN , Publish Date - Jan 22 , 2025 | 12:35 PM

IT Raids: 'పుష్ప 2' చిత్ర దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పుష్ప 2 నిర్మాణంలో సుకుమార్‌కు షేర్లు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు.

IT Raids on sukumar's house

ఇప్పటి వరకు కేవలం నిర్మాతల ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు ఇప్పుడు 'పుష్ప 2' డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 'పుష్ప 2' నిర్మాణంలో సుకుమార్ నిర్మాణ సంస్థ 'సుకుమార్ రైటింగ్స్'.. మైత్రీ మూవీ మేకర్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుకుమార్ ఇల్లు, కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే దర్శకుడు సుకుమార్ ని ఐటీ అధికారులు ఎయిర్‌పోర్టు నుండి ఇంటికి తీసుకువచ్చారని వార్తలు ప్రచారం అవుతున్నాయి..


మరోవైపు.. 'గేమ్ చేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాల నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాలతో పాటు బంధుమిత్రుల ఇళ్లలోనూ రెండో రోజు సోదాలు జరుగుతున్నాయి. తాజాగా దిల్ రాజు కుమార్తె హన్సితారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆమె సమక్షంలోనే డిజిటల్ లాకర్లు ఓపెన్ చేయించారు. మరికొద్దిసేపట్లో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయించనున్నారు ఐటీ అధికారులు. మంగళవారం దిల్ రాజు ఇంట్లో ఆయన భార్య తేజస్వి సమక్షంలో లాకర్లు ఓపెన్ చేయించిన విషయం తెలిసిందే.


మరో పక్కా మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థకు సంబంధించి రవిశంకర్, నవీన్‌, సీఈఓ చెర్రీ ఇళ్లు, కార్యాలయాలు, వారి భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సింగర్‌ సునీత భర్త రాముకు సంబంధించిన మ్యాంగో మీడియా సంస్థలోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. వీళ్ళే కాకుండా అభిషేక్ పిక్చర్స్ అధినేత, నిర్మాత అభిషేక్ అగర్వాల్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత కిషోర్ తదితరులు ఇంట్లో సోదాలు జరిగినట్లు సమాచారం.

Also Read-Rashmika Mandanna: హీరోయిన్ రష్మికకు తీవ్ర గాయం.. ఆందోళనలో అభిమానులు

Also Read-Ram Charan: బుచ్చి బాబు 'మల్టీ గేమ్'.. తారక్ ప్రాజెక్ట్ ఇదే

Also Read- IT Raids: లెక్కలు తేల్చాల్సిందే.. కొనసాగుతున్న ఐటీ దాడులు

Also Read- Rashmika Mandanna: పెరుగుతున్న రష్మిక ఆధిపత్యం.. శ్రీవల్లికి మరో ఛాలెంజ్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 22 , 2025 | 12:40 PM