Dil Raju: 'దిల్ రాజు'పై ఐటీ దాడులు..
ABN , Publish Date - Jan 21 , 2025 | 07:23 AM
Dil Raju: మంగళవారం ఉదయం ఐటీ అధికారులు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఆయన కుటుంబ సభ్యలు, పార్ట్నర్స్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
ప్రముఖ సినీ నిర్మాత, TFDC ఛైర్మన్ దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో మంగళవారం ఉదయం ఐటీ అధికారులు దాడి చేశారు. దిల్ రాజుతో పాటు ఆయన పార్ట్నర్, నిర్మాత శిరీష్ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్ రాజు కూతరు హన్సిత రెడ్డి ఇంటిని కూడా ఐటీ అధికారులు తనిఖీ చేశారు. వీరితోపాటు మరి కొందరు సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖ నిర్మాతల ఇళ్లలోనూ సోదాలు చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. కాగా, ఈ సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి సినిమాలని ఆయన భారీ బడ్జెట్ తో నిర్మించిన విషయం తెలిసిందే. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుపుతుండటం గమనార్హం.
తాజాగా 'పుష్ప 2' ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్, 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆఫీస్ లోను అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారే ఐటీ అధికారులు విజృంభించడంతో అందరు ఆసక్తికరంగా ఈ ఎపిసోడ్ ని వీక్షిస్తున్నారు.