Simran: డబ్బా రోల్స్ ... జ్యోతిక గురించేనా ..!
ABN , Publish Date - Apr 21 , 2025 | 05:55 PM
నటి సిమ్రాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ అవార్డు ఫంక్షన్ లో తన కోస్టార్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
సినీ ఇండస్ట్రీ అంటేనే కలర్ ఫుల్ ఇండస్ట్రీ. హిట్లు ఫ్లాపులు హీరోలను టాప్ ప్లేస్ కి చేరిస్తే... గ్లామర్ ట్రీట్ పర్పామెన్స్.... హీరోయిన్లను ఆడియెన్స్ కు దగ్గర చేస్తాయి. అలాంటి నటనతో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్న నటి సిమ్రాన్ (Simran). 90లలో టాప్ హీరోలందరితో నటించడంతో పాటు తన గ్లామర్ తో ఓ రేంజ్ లో సిల్వర్ స్క్రీన్ ను ఊపేసింది. కొన్నాళ్లు వెండితెరకు దూరమైన ఈ బ్యూటీ... అప్పుడప్పుడు తన మార్క్ ను చాటుకుంటోంది. సినిమా మీద ఇష్టంతో ఎలాంటి రోల్ వచ్చినా, కాదనకుండా చేసేస్తోంది సిమ్రాన్.. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ లో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
JFW మూవీ అవార్డులు 2025లో కార్యక్రమంలో అంధగాన్ (Andhagan )మూవీలో నెగిటివ్ రోల్ చేసిన సిమ్రాన్ కు అవార్డ్ వచ్చింది. ఈ అవార్డు తీసుకున్న తర్వాత ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తన కో స్టార్ అయిన ఓ నటి చేసిన సినిమాను చూసి ఫస్ట్ టైం మెసేజ్ చేశానని... తన పర్పామెన్స్ బాగుందని చెబుతునే.... ఇలాంటి రోల్స్ ఎందుకు ఎంచుకుంటున్నావని అడిగితే... ఆంటీ రోల్స్ కంటే ఇవే బెటర్ అంటూ కౌంటర్ ఇచ్చిందని చెప్పింది. అయితే డమ్మి రోల్స్ కంటే సపోర్టింగ్ రోల్స్, తల్లి, ఆంటీ క్యారెక్టర్లు చేయడం నయమంటూ స్టేజిపై సిమ్రాన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇంతకూ సిమ్రాన్ ఎవరికి కౌంటర్ ఇచ్చిందా అన్న డిస్కషన్ మొదలైంది.
సోషల్ మీడియాలో హాట్ డిబేట్ నడుస్తుండగా.... కొందరు మాత్రం జ్యోతిక గురించే అంటూ చర్చించుకుంటున్నారు. మరికొందరు లైలాని ప్రస్తావిస్తున్నారు. సూర్యని పెళ్లాడిన తర్వాత హీరోయిన్‌గా సినిమాలు చేయడం మానేసిన జ్యోతిక (Jyothika ) .. కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది. తాజాగా ‘డబ్బా కార్టెల్’ (Dabba Cartel )అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటించింది జ్యోతిక. సిమ్రాన్ చేసిన ‘డబ్బా’ రోల్స్, ‘డబ్బా కార్టెల్’ గురించే అని అనుమానిస్తున్నారు అభిమానులు. ఇటు ఆది పినిశెట్టి(Adi Pinishetti) శబ్దం(Sabdham) లో సూట్ అవ్వని రోల్ లో లైలా(Laila) నటించింది. ఈ ఇద్దరు పేర్లే కాదు... స్నేహా,(Sneha) అంజలి ( Anjali )పేర్లను కూడా ప్రస్తావిస్తున్నారు. మొత్తానికి సిమ్రాన్ ఎవరికి కౌంటర్ ఇచ్చిందో తెలియదు కానీ.... నెటిజన్లు మాత్రం రకరకాలుగా ఊహించుకుంటున్నారు.