Heroine Rakshita: గుర్తుపట్టలేని స్థితిలో పూరి హీరోయిన్..
ABN , Publish Date - Feb 04 , 2025 | 08:45 AM
Heroine Rakshita: "హీరోయిన్స్ అంటే ప్రేక్షకుల దృష్టిలో దేవతలుగా ఉంటారు.. అలాంటి దేవతలు కూడా పెళ్లిళ్లు చేసుకొని.. పిల్లల్ని కనేసి మనుషులుగా మారిపోవడం ఏ మాత్రం సమంజసం కాదు" అంటూ పూరి జగన్నాద్ చేసిన కామెంట్స్‌తో పూరి హీరోయిన్ పోలుస్తున్నారు.
డైరెక్టర్ పూరి జగన్నాద్.. ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్లు అందరు గ్లామర్ క్వీన్లే. చాలా మందికి తెలియని విషయం కన్నడ సూపర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ని సిల్వర్ స్క్రీన్ కు ఇంట్రడ్యూస్ చేసింది పూరి జగన్నాదే. పూరి 2002లో కన్నడలో 'అప్పు' అనే సినిమా ద్వారా పునీత్ రాజ్ కుమార్ ని, హీరోయిన్ రక్షితని సిల్వర్ స్క్రీన్ కు ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ సినిమా 200 రోజులు థియేటర్లలో ఆడి సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఆ హీరో, హీరోయిన్ కెరీర్ ఫస్ట్ మూవీతోనే బిగ్ బ్రేక్ లభించింది.
హీరో గురించి కాసేపు పక్కనే పెడితే.. హీరోయిన్ రక్షిత 'అప్పు' తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. కన్నడతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లోనూ పెద్ద పెద్ద స్టార్స్ తో నటిస్తూ.. సూపర్ బిజీగా మారిపోయారు. కెరీర్ లో ఫస్ట్ బ్రేక్ ఇచ్చినా పూరీనే ఆమెను మళ్ళీ తెలుగులో 'ఇడియట్' సినిమాలో సుచిత్రాగా చూపించి ఊహించనంత పెద్ద విజయాన్ని అందించాడు. ఆ తర్వాత ఆమె.. ‘పెళ్ళాం ఊరెళితే’, ‘నిజం’, ‘శివమణి’, ‘ఆంధ్రావాలా’, ‘అందరివాడు’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు కొల్లగొట్టింది. ఆ తర్వాత అవకాశాలు కాస్త తగ్గుతూ రావడంతో ఆమె కన్నడ ఇండస్ట్రీకి చెక్కేసి ఓ డైరెక్టర్ ని పెళ్లాడింది. తర్వాత ఓ బాబుకు జన్మనిచ్చింది. కానీ.. ప్రస్తుతం..
కానీ.. ప్రస్తుతం ఆమెను చూస్తే గుర్తుపట్టలేని స్థితిలోకి మారిపోయింది. ఒకప్పుడు స్లిమ్ గా గ్లామర్ క్వీన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె ప్రస్తుతం భారీ శరీరంతో కనిపించారు. ఆమె థైరాయిడ్ కారణంగానే బరువు పెరిగినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా కరోనా సమయంలో ఆమె వీపరీతమైన బరువు పెరిగినట్లు ఓ టాక్ షోలో వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.