Vijay Devarakonda: కింగ్ డమ్ టీజర్ ఓ.ఎస్.టి.కి హ్యూజ్ రెస్పాన్స్
ABN , Publish Date - Mar 19 , 2025 | 04:07 PM
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న 'కింగ్ డమ్' మూవీ మే 30న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన వస్తోంది.
హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటిస్తున్న 'కింగ్ డమ్' (Kingdom) సినిమా టీజర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (OST) రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ టీజర్ కు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) కంపోజ్ చేసిన బీజీఎం ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. 'కింగ్ డమ్' టీజర్ కు వచ్చిన హ్యూజ్ రెస్పాన్స్ కు అనిరుధ్ మ్యూజిక్ వన్ ఆఫ్ ది రీజన్ అయ్యింది. ఇప్పుడు ఒరిజినల్ సౌండ్ ట్రాక్ లో ఆ బీజీఎంను కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజిక్ లవర్స్. ఈ సినిమా మీద ఆడియెన్స్ కు ఉన్న క్రేజ్ ను టీజర్ ఓఎస్ టీకి వస్తున్న రెస్పాన్స్ రిఫ్లెక్ట్ చేస్తోంది.
విజయ్ దేవరకొండ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ మూవీగా 'కింగ్ డమ్' ఉండబోతోంది. ఈ చిత్రాన్ని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) రూపొందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ (Nagavamsi), సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. 'కింగ్ డమ్' సినిమా మే 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Also Read: Dhanush Vs Ashwin: థియేటర్లోనే కాదు ఓటీటీలోనూ వార్...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి