Hrithik Roshan: ఎన్టీఆర్, హృతిక్‌ల మధ్య డాన్స్ వార్

ABN , Publish Date - Jan 13 , 2025 | 09:26 PM

Hrithik Roshan: తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో హృతిక్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో జరిగే సన్నివేశాల గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవెయిటింగ్ మల్టీ స్టారర్ మూవీ 'వార్ 2'.

Hrithik Roshan Vs Jr Ntr

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవెయిటింగ్ మల్టీ స్టారర్ మూవీ 'వార్ 2'. యశ్ రాజ్ ఫిల్మ్స్(YRF) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్( YRF Spy Universe )లో భాగంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్ర పోషించనున్నాడు. తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో హృతిక్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో జరిగే సన్నివేశాల గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.


తాజాగా హృతిక్ రోషన్ బాలీవుడ్ డెబ్యూ మూవీ 'కహో నా ప్యార్ హై' రిలీజై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సినిమాని రీ రిలీజ్ చేశారు. అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం.. హృతిక్ ని ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయ్యాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో హృతిక్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఒక పెద్ద డాన్స్ నంబర్ ప్లాన్ చేస్తునట్లు తెలిపాడు. అలాగే "నా కాళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటున్న, ఆ పోటీలో నిలిచేందుకు రెడీ అవుతున్న" అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికే మేకర్స్ నాటు నాటుకి మించి డాన్స్ పర్ఫామెన్స్ అదిరిపోయేలా కొరియోగ్రాఫీ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు టాప్ డాన్సర్లు పోటీ పడనుండటంతో సర్వత్రా ఆసక్తి రేకెత్తుతోంది.


ఈ సినిమాలో తారక్ -హృతిక్ రోషన్‌కు మధ్యలో భారీ యాక్షన్ ప్యాక్‌డ్ సీక్వెన్సెస్ ప్లాన్ చేశారు. వీరిద్దరి మధ్య 'హ్యాండ్ టూ హ్యాండ్' ఫైట్ సీక్వెన్సెస్ ఉండనున్నాయి. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఏడాది ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Jan 13 , 2025 | 09:26 PM