Natural Star: నాని బర్త్ డేన ఫ్యాన్స్ కు ఇచ్చే కానుక ఏంటంటే...
ABN , Publish Date - Feb 20 , 2025 | 07:37 PM
నేచురల్ స్టార్ నాని ఏ పాత్ర చేసినా దానికి సంపూర్ణ న్యాయం చేయడానికి తహతహలాడుతుంటాడు. ప్రస్తుతం నాని దృష్టి అంతా అతని 'హిట్' ఫ్రాంచైజ్ థర్డ్ కేస్ మీదనే ఉంది.
నేచురల్ స్టార్ నాని (Nani) హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్: ది థర్డ్ కేస్'. శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్' (Hit) సిరీస్‌లో మూడవ భాగంగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్‌లకు మంచి స్పందన లభించింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్ర టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్‌తో మేకర్స్ వచ్చారు. ఈ చిత్రం ఇంటెన్స్ టీజర్‌ను ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్ర ప్రధాన కథాంశం, నాని పోషిస్తున్న ఫెరోషియస్ అర్జున్ సర్కార్ క్యారెక్టర్ తో పాటు మిగతా పాత్రల గురించి కీలక వివరాలను ఆవిష్కరించడానికి టీం సిద్ధంగా ఉంది.
టీజర్ పోస్టర్ లో నాని చేతిలో గొడ్డలి పట్టుకొని, తన పాదాల దగ్గర పడిపోయిన మనుషులతో కమాండింగ్ పోజిషన్ లో కనిపిస్తున్నారు. ఈ బోల్డ్ ఇమేజ్ అతని పాత్ర యొక్క ఫెరోషియస్ అండ్ ఇంటెన్స్ నేచర్ ని తెలియజేస్తోంది. నానికి జోడిగా శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) నటిస్తోంది. దీనికి సాను జాన్ వర్గీస్ డీవోపీ, మిక్కీ జె. మేయర్ (Mickey J Meyer) సంగీతం అందిస్తున్నారు. ఈ యేడాది మే 1న మూవీ థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.