హిట్‌-3 టీజర్‌ రికార్డ్‌.. విజయ్‌ను కొట్టేశాడు..

ABN , Publish Date - Feb 25 , 2025 | 02:24 PM

నేచురల్‌ స్టార్‌ నాని (Nani) పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’ (Hit 3) టీజర్‌తో ఫ్యాన్స్‌ను మెప్పించడే కాకుండా సోషల్‌ మీడియాను షేక్‌ చేశారు.


నేచురల్‌ స్టార్‌ నాని (Nani) పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’ (Hit 3) టీజర్‌తో ఫ్యాన్స్‌ను మెప్పించడే కాకుండా సోషల్‌ మీడియాను షేక్‌ చేశారు. టీజర్‌ విడుదల తర్వాత సినిమాపై విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అయింది.  విడుదలైన 24 గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకొని రికార్డులు సొంతం చేసుకుంటోంది. ఈ మధ్యనే విడుదలైన విజయ్‌ దేవరకొండ ‘కింగ్‌ డమ్‌’ (Kingdom) టీజర్‌ యూట్యూబ్‌ వ్యూస్‌ను ‘హిట్‌ 3’ బీట్‌ చేసింది. (Hit: The Third Case) విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కింగ్‌డమ్‌’. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ ఇటీవల విడుదలైంది.

ఎన్టీఆర్‌ చెప్పిన వాయిస్‌ ఓవర్‌తో మొదలైన ఈ టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. ఇప్పటివరకు దీనికి 15 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. నాని హీరోగా రూపొందుతున్న ‘హిట్‌ 3’ టీజర్‌  ప్రస్తుతం ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తోంది. కేవలం 24 గంటల్లోనే 16 మిలియన్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకుంది. దీంతో విజయ్‌ దేవరకొండ రికార్డును నాని బీట్‌ చేశారంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.  నాని హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి శైలేశ్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాని పవర్‌ ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో అర్జున్‌ సర్కార్‌గా కనిపించనున్నారు. మే 1న ఈ చిత్రం విడుదల కానుంది.                        






Updated Date - Feb 25 , 2025 | 03:34 PM