HIT 3: నాని నమ్మకం నిజమైంది.. హిట్‌ దర్శకుడు హ్యాపీ పోస్ట్‌!

ABN , Publish Date - Mar 13 , 2025 | 04:48 PM

నాని (Nani) నిర్మాతగా వ్యవహరించిన ‘కోర్ట్‌’ సినిమా (Court movie) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ‘కోర్ట్‌’ నచ్చకపోతే మరో రెండు నెలల్లో రాబోయే తన తాజా చిత్రం ‘హిట్‌ 3’ (Hit 3) చూడొద్దని బహిరంగంగా చెప్పారు.

నాని (Nani) నిర్మాతగా వ్యవహరించిన ‘కోర్ట్‌’ సినిమా (Court movie) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ‘కోర్ట్‌’ నచ్చకపోతే మరో రెండు నెలల్లో రాబోయే తన తాజా చిత్రం ‘హిట్‌ 3’ (Hit 3) చూడొద్దని బహిరంగంగా చెప్పారు. తాజాగా ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి ‘హిట్‌ 3’ దర్శకుడు ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్‌జగదీశ్‌ 9Ram Jagadish) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కోర్ట్‌’. మార్చి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా దీని పెయిడ్‌ ప్రీమియర్స్‌ ప్రదర్శించగా ఇది మంచి టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో తన సినిమా సేఫ్‌ అంటూ శైలేశ్‌ కొలను ట్వీట్‌ (Sailesh kolanu Tweet) చేశారు.

‘‘నా సినిమా సేఫ్  (హిట్‌ 3). ‘కోర్ట్‌’ సినిమాలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. ఇది కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అందరూ చూడాల్సిన చిత్రమిది. మూవీ యూనిట్‌కు నా అభినందనలు. ప్రియదర్శి.. నువ్వు మరో విజయం హిట్‌ అందుకున్నావు. ఇక నా ‘హిట్‌ 3’ ఎడిట్‌ రూమ్‌కు వెళ్లాలి. అందరూ కోర్ట్‌ సినిమా చూడండి’’ అని పోస్ట్‌ పెట్టారు. ఈ పోస్ట్‌కు ‘మిర్చి’లో ప్రభాస్‌ పోస్టర్‌ను జోడించారు. మిర్చిలో ప్రభాస్‌ ‘నా ఫ్యామిలీ ేసఫ్‌’ అని డైలాగు చెప్పే ఇమేజ్‌లను శైలేశ్‌ కొలను షేర్‌ చేశారు. ‘కోర్ట్‌’కు హిట్‌ కాబట్టి ‘హిట్‌ 3’ సినిమా ేసఫ్‌ అని తన పోస్ట్‌తో చెప్పారు. ‘హిట్‌ 3’ విషయానికొస్తే ‘హిట్‌’ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న చిత్రం ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’. నాని కథానాయకుడిగా శైలేశ్‌ కొలను దర్శకత్వంలో ఈ సినిమా సిద్థమవుతోంది. ఇందులో నాని పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో అర్జున్‌ సర్కార్‌గా కనిపించనున్నారు. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

Updated Date - Mar 13 , 2025 | 04:48 PM