బాలయ్య మెప్పు పొందిన ‘ది సస్పెక్ట్’ చిత్ర హీరో.. ఎందుకంటే?
ABN , Publish Date - Jan 11 , 2025 | 10:24 PM
నందమూరి బాలకృష్ణ అంటే నందమూరి అభిమానులు ఎంతగా ప్రేమిస్తారో, ఎంతగా ఆరాధిస్తారో తెలియంది కాదు. అలాంటి ఓ నందమూరి వీరాభిమానికి బాలయ్య నుండి ప్రశంస వస్తే.. ఎలా ఉంటుంది? అసలా అభిమానిని పట్టుకోగలమా. అదే జరుగుతుంది ‘ది సస్పెక్ట్’ మూవీ హీరో విషయంలో. మ్యాటర్ ఏంటంటే..
నందమూరి నటసింహం బాలయ్యకు ఎటువంటి అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కోప్పడినా, కొట్టినా చాలు అని సంతోషపడే వారెందరో ఉన్నారు. అలాగే అభిమానులంటే బాలయ్య కూడా అంతే ప్రేమగా ఉంటారు. అభిమానులకు, బాలయ్యకు మధ్య ఉన్న బాండింగే వేరు. అది చాలా సందర్భాలలో ఆ విషయం నిరూపితమైంది. ఈ క్రమంలో ‘ది సస్పెక్ట్’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్న ప్రవాస తెలుగుతేజం, బాలయ్య అభిమాని రుషి కిరణ్.. ‘డాకు మహారాజ్’తో ఈ సంక్రాంతిని కబ్జా చేసేందుకు వస్తున్న బాలయ్య ప్రశంసలు అందుకుని.. తన జన్మ ధన్యమైనట్లుగా భావిస్తున్నానని తెలిపారు. విషయం ఏమిటంటే..
Also Read- Game Changer: ‘గేమ్ చేంజర్’కి షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం
అమెరికాలోని డల్లాస్‌లో రీసెంట్‌గా ‘డాకు మహారాజ్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో ‘అఖండ’ గెటప్‌లో సందడి చేసిన బాలయ్య వీరాభిమాని రుషి కిరణ్... ఆ గెటప్పులో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించడంతోపాటు.. బాలయ్య అది చూసి ప్రత్యేకంగా పిలుచుకుని ప్రశంసించారు. డల్లాస్ మరియు పరిసర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు 7 వేల మందికి పైగా ఈ వేడుకలో పాల్గొన్నారు. అంతమందిలో బాలయ్య తనని పిలిచి ప్రశంసించడంతో.. తన ఆనందానికి అవధులే లేవని అంటున్నారు రుషి కిరణ్.
ఈ సంక్రాంతికి వస్తున్న ‘డాకు మహారాజ్’ బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలవడం ఖాయమని రుషి కిరణ్ ఆకాంక్షించారు. రుషి కిరణ్ నటించిన ‘ది సస్పెక్ట్’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఆ చిత్ర ప్రమోషన్స్‌ని మొదలు పెడతామని ఈ సందర్భంగా రుషి కిరణ్ తెలిపారు.