Nani: 'ఎస్‌ఎస్‌ఎంబీ29' కంటెంట్‌ లీక్‌.. హీరో ఏమన్నారంటే..

ABN , Publish Date - Apr 24 , 2025 | 05:10 PM

సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా ఎస్‌ఎస్‌ రాజమౌళి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎంబీ 29 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం భారీ స్థ్థాయిలో నిర్మిస్తున్నారు నిర్మాత కె.ఎల్‌.నారాయణ

సూపర్‌స్టార్‌ మహేశ్‌ (Mahesh Babu) హీరోగా ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎంబీ 29 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు నిర్మాత కె.ఎల్‌.నారాయణ. ఒడిశాలో షూటింగ్‌ జరిగిన సమయంలో కొన్ని విజువల్స్‌ నెట్టింట లీక్‌ అయ్యాయి. ఈ లీక్స్‌పై తాజాగా హీరో నాని (Nani)మాట్లాడారు. ‘‘రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడి చిత్రమంటే వేల మంది జూనియర్‌ ఆర్టిస్టులు పని చేస్తుంటారు.  ప్రతి విభాగంలో వందల మంది ఉంటారు. అన్ని విషయాలను పరిశీలిస్తుంటారు. అందుకే షూటింగ్‌ ప్రదేశానికి సెల్‌ఫోన్లు అనుమతించరు. చిత్ర బృందంలో కొందరు మాత్రం కళ్లుకప్పి ఫోన్‌ తీసుకెళ్తారు. ఒక ఫోన్‌ తనిఖీ సిబ్బందికి ఇచ్చి.. మరొకదాన్ని ఎవరికీ కనిపించకుండా షూటింగ్‌ స్పాట్‌కు తీసుకెళ్తారు. ఎవరికీ కనిపించకుండా ఫోటోలు తీస్తుంటారు. లీక్‌ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఎన్నో అడ్డదారులు ఉంటాయి. దీని గురించి మనం ఎన్ని జాగ్రతలు తీసుకున్నా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. రాజమౌళి ఎంతో రహస్యంగా తెరకెక్కిద్దాం అని ప్రయత్నించినప్పటికీ కొన్ని విజువల్స్‌ లీక్‌ అయ్యాయి. కచ్చితంగా వీటికి అడ్డుకట్ట వేయాలి. ఇలాంటివి జరగకుండా ఎదుర్కోవాలి’’ అని నాని అన్నారు.

ఒడిశాలో షూటింగ్‌ జరుగుతోన్న సమయంలో మహేశ్‌కు సంబంధించిన కొన్ని విజువల్స్‌ లీక్‌ అయ్యాయి. అవి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన చిత్రబృందం వెంటనే చర్యలకు దిగింది. నెటిజన్లు షేర్‌ చేసిన వీడియోలను తొలగించింది. ఆ ఘటనతో ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ టీమ్‌ తదుపరి షెడ్యూల్‌ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్టు సమాచారం.

Updated Date - Apr 24 , 2025 | 05:10 PM