Kavya Keerthi: సోలో క్యారెక్టర్ తో హలో బేబీ...

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:15 PM

జయాపజయాలను పట్టించుకోకుండా సింగిల్ క్యారెక్టర్ తో సినిమాలు తీయడానికి మేకర్స్ ఇప్పటికీ ఆసక్తి కనబరుస్తున్నారు. హన్సిక, నందిత శ్వేత, గార్గేయి వంటి హీరోయిన్లు సింగిల్ క్యారెక్టర్ మూవీస్ చేశారు. ఆ జాబితాలో ఇప్పుడు కావ్య కీర్తి కూడా చేరింది.

సోలో క్యారెక్టర్ తో సినిమాలు రూపుదిద్దుకోవడం ఇటీవల తెలుగులో కాస్తంత పెరిగింది. ఇలాంటి సినిమాలు కమర్షియల్ గా గొప్ప విజయాన్ని అందుకోకపోయినా... మీడియా అటెన్షన్ ను డ్రా చేస్తున్నాయి. అలానే అందులోని నటీనటుల ప్రతిభను వెలికి తీస్తున్నాయి. ఇటీవల ఆదిత్య ఓం (Aditya Om) 'బందీ' మూవీని సోలో క్యారెక్టర్ తోనే చేశాడు. పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో ఆ సినిమా రూపుదిద్దుకుంది. అలానే గతంలో బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) 'డేగల బాబ్జీ', హన్సిక (Hansika) '105 మినిట్స్', నందిత శ్వేత (Nanditha Swetha) 'రా రా పెనిమిటి', గార్గేయి ఎల్లాప్రగడ 'హలో మీరా' సినిమాలు సింగిల్ క్యారెక్టర్ తో వచ్చినవే.


తాజాగా కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ తో కాండ్రేగుల ఆదినారాయణ 'హలో బేబీ' (Hello Baby) అనే సినిమా నిర్మించారు. దీనికి రామ్ గోపాల్ రత్నం దర్శకత్వం వహించారు. ఫోన్ హ్యాకింగ్ కథతో సోలో క్యారెక్టర్ తో ఈసినిమా మొత్తాన్ని తీశారు. రమణ కె సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి సుకుమార్ పి సంగీతం అందించారు. సాయిరాం తాటిపల్లి దీనికి ఎడిటర్. సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కించిన 'హలో బేబీ' మూవీని ఏప్రిల్ 25నవిడుదల చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు.

Also Read: Pahalgam: ఉగ్రదాడిపై విజయ్ దేవరకొండ ఆవేదన

Also Read: Pathala Bhairavi: బి.యన్.రెడ్డి తో యన్టీఆర్ ప్రత్యేక బంధం...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 23 , 2025 | 12:20 PM