NBK: బాలయ్య కోసం రూట్‌ మార్చాడు.. ఇక దబిడిదిబిదే

ABN , Publish Date - Feb 15 , 2025 | 10:08 AM

ఇటీవల చేసిన మిస్టర్‌ బచ్చన్‌ (Mr Bachchan) నిరుత్సాహపరచింది. పవన్‌తో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమా సెట్స్‌ మీదుంది. పవన్‌ ఇచ్చే డేట్స్‌ను బట్టి ఆ సినిమా రూట్‌ తెలుస్తోంది. ఈలోపు హరీశ్‌ మరో ప్రయత్నం చేస్తున్నాడు. బాలయ్యతో (NBK) సినిమా చేయాలనుందని చాలాకాలంగా చెబుతున్నారు. అ


హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) మాస్‌, కమర్షియల్‌ చిత్రాలు తీయడంలో దిట్ట. హీరోని ఎలివేట్‌ చేయడంలో మాస్టర్‌. గబ్బర్‌సింగ్‌తో తన సత్తా ఏంటో చూపించాడు. అయితే ఆ తర్వాత ఆ స్థాయి విజయం దక్కలేదు. అలాగని కిందకు పడిపోలేదు. సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇటీవల చేసిన మిస్టర్‌ బచ్చన్‌ (Mr Bachchan) నిరుత్సాహపరచింది. పవన్‌తో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమా సెట్స్‌ మీదుంది. పవన్‌ ఇచ్చే డేట్స్‌ను బట్టి ఆ సినిమా రూట్‌ తెలుస్తోంది. ఈలోపు హరీశ్‌ మరో ప్రయత్నం చేస్తున్నాడు. బాలయ్యతో (NBK) సినిమా చేయాలనుందని చాలాకాలంగా చెబుతున్నారు. అది ఎట్టకేలకు ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. ఇన్‌సైడ్‌ వర్గాల సమాచారం ప్రకారం..  బాలయ్యకు హరీశ్‌ ఓ కథ వినిపించాడు. ఆ లైన్‌, చేసిన డెవలప్‌మెంట్‌ బాలకృష్ణను విపరీతంగా ఆకట్టుకుందట. దాంతో బాలయ్య (Bala Krishna) సై అన్నారని తెలిసింది.  ప్రస్తుతం యశ్‌ హీరోగా ‘టాక్సిక్‌’ చిత్రాన్ని నిర్మిస్తోన్న కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌ (KVN Productions) సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.  

Robinhood: మహేష్ బాబు వదిలిన  'రాబిన్‌హుడ్‌' లవ్లీ & పెప్పీ బ్రాండ్ సాంగ్ 




అయితే దర్శకుడు హరీష్‌ శంకర్‌ పై రీమేక్‌ దర్శకుడన్న ట్యాగ్‌ ఉంది. ఆయన సినిమాల్లో ఎక్కువ శాతం రీమేకులే. సూపర్‌ హిట్టయిన గబ్బర్‌ సింగ్‌,  ఇటీవల ఫ్లాప్‌ అయిన మిస్టర్‌ బచ్చన్‌ రీమేక్‌ కథలే. అయితే బాలయ్య కోసం కొత్త కథ రాశాడని, తెలిసింది. రీమేక్‌ జోన్‌లో సేఫ్‌ గేమ్‌ ఆడిన హరీశ్‌ ఇప్పుడు ఆ జోన్‌ నుంచి బయటకు వచ్చి హిట్‌ ఓ కొత్త కథ రెడీ చేశారట. హిట్‌ కొట్టడానికి తనకున్న మంచి అవకాశమిది. ప్రస్తుతం బాలయ్య రేంజ్‌ మామూలుగా లేదు. హిట్టుల మీద హిట్టులు మాంచి జోరులో ఉన్నారు. ఆయన పట్టిందల్లా బంగారమైపోతోంది. ఈ సమయంలో బాలయ్యతో సినిమా అంటే దర్శకుడు చాలా పకడ్భందీగా ఉండాలి. ఇది హరీశ్‌కు మంచి ఆఫర్‌. త్వరలో ఈ సినిమాకు సంబంధించి వివరాలు బయటకు వస్తాయి. ప్రస్తుతం బాలయ్య ఆఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకుడు.

Jacqueline Fernandez : పిచ్చివాడిలా ప్రేమిస్తున్నా.. నీ గుండె చప్పుడు అవుతాను..


Updated Date - Feb 15 , 2025 | 12:58 PM