Hari Hara Veera Mallu: కొల్లగొట్టినాదిరో.. వచ్చేది ఎప్పుడంటే...

ABN , Publish Date - Feb 15 , 2025 | 03:36 PM

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా రాబోతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’ HariHara Veeramallu). ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. 50 శాతం చిత్రీకరణ క్రిష్‌ చేయగా, ప్రస్తుతం మిగతా భాగాన్ని జ్యోతి కృష్ణ (Jyothy krishna) పూర్తి చేస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా రాబోతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’ HariHara Veeramallu). ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. 50 శాతం చిత్రీకరణ క్రిష్‌ చేయగా, ప్రస్తుతం మిగతా భాగాన్ని జ్యోతి కృష్ణ (Jyothy krishna) పూర్తి చేస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. నిధిఅగర్వాల్‌  (Nidhhi Agerwal) కథానాయిక. బాబీ దేవోల్‌ విలన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే మొదటి పాట విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

‘‘కొల్లగొట్టినాదిరో..’’ (kollagottinadiro) అంటూ సాగే లవ్‌ సాంగ్‌ను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు ప్రేమికుల రోజు సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో పవన్‌ - నిధీ రొమాంటిక్‌ లుక్‌లో చూడముచ్చటగా ఉన్నారు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌  యోధుడిగా కనిపించనున్నారు. పంచమి అనే యువరాణిగా నిధి కనువిందు చేయనుంది. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలి భాగం ‘హరి హర వీరమల్ల్లు పార్ట్‌-1 స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో మార్చి 28న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Feb 15 , 2025 | 03:36 PM