Hari Hara Veera Mallu: కీలక షెడ్యూల్‌..  పవన్‌ డేట్స్‌ దొరుకుతాయా..

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:37 PM

రాజాస్థాన్‌లో చిత్రీకరణ అంతా పవన్‌కల్యాణ్‌ మీదే ఉంది. ప్రస్తుతం ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడున్న ఆ బాధ్యతలను వదిలిపెట్టి  డేట్స్‌ ఇస్తారా?

Hari Hara Veera Mallu



'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) చిత్రం షూటింగ్‌ ఇటీవల హైదరాబాద్‌ ముచ్చింతల్‌లో జరిగింది. నాలుగు రోజులపాటు బాబీ డియోల్‌తో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ సీన్స్‌ నుంచే బాబీ డియోల్‌ (bobby deol) పుట్టినరోజు సందర్బంగా కత్తి పట్టిన స్టిల్‌ను వదిలారు. సినిమాకు మరో కీలక షెడ్యూల్‌ను రాజస్థాన్‌లో ప్లాన్‌ చేశారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. రాజాస్థాన్‌లో చిత్రీకరణ అంతా పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) మీదే ఉంది. ప్రస్తుతం ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడున్న ఆ బాధ్యతలను వదిలిపెట్టి  డేట్స్‌ ఇస్తారా? షూటింగ్‌కు వెళ్తారా, అన్నదే అనుమానం. అయితే ఆయన కుదిరిన ప్రతిసారీ డేట్స్‌ ఇచ్చి షూటింగ్‌ చేస్తున్నారు. (APDCM)

ఇప్పుడు అలాగే చేస్తారని టాక్‌. దాని కోసం నిర్మాత ఎ.ఎం.రత్నం పవన్‌ కల్యాణ్‌ అనుమతి కోసం గురువారం విజయవాడ వెళ్లారని తెలిసింది. మరి పవన్‌ ఏం చేస్తారో చూడాలి. సినిమా డిలే కావడం వల్ల నిర్మాతగా రత్నంకు ఎంతో ఖర్చు, అలాగే ఒత్తిడి కూడా. ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి నిర్మాతగా రత్నం మరో సినిమా జోలికి వెళ్లలేదు. ఈ సినిమా భవిష్యత్తుతో పాటు నిర్మాతగా భారీగా బడ్జెట్‌ పెట్టిన రత్నం భవిష్యత్తు కూడా ఈ సినిమా, పవన్‌కల్యాణ్‌ మీదే ఆధారపడి ఉంది. మరి పవన్‌ ఏం చేస్తారో చూడాలి.



పవన్‌ సరసన నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తొలుత క్రిష్‌ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం  జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్‌ పోరాట యోఽధుడిగా పవర్‌ఫుల్‌గా కనిపిస్తారు. బాబీ డియోల్‌ విలన్‌గా కనిపిస్తారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని మార్చి 28న విడుదల చేయనున్నారు.

Updated Date - Jan 31 , 2025 | 07:44 AM