HHVM First Single: మాట వినాలి.. గురుడా మాట వినాలి
ABN , Publish Date - Jan 17 , 2025 | 10:44 AM
"వినాలి.. వీరమల్లు మాట చెబితే వినాలి’ (Maata Vinali) అంటూ సంక్రాంతి కానుకగా ఫస్ట్ గింప్స్‌తో సందడి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. 11 సెకెన్ల చిన్న వీడియో ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే!
"వినాలి.. వీరమల్లు మాట చెబితే వినాలి’ (Maata Vinali) అంటూ సంక్రాంతి కానుకగా ఫస్ట్ గింప్స్‌తో సందడి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan). 11 సెకెన్ల చిన్న వీడియో ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే! ఇప్పుడు 'హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' (HariHara Veeramallu) బృందం మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ (HHMV First single) సాంగ్‌ను విడుదల చేశారు. "మాట వినాలి.. గురుడా మాట వినాలి.. మాట వినాలి మంచి మాట వినాలి’’ అంటూ పవన్ పాడిన పాటను శుక్రవారం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్ అవుతుంది.
తొలుత ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. దాదాపు 50 శాతం సినిమా ఆయనే పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. ఎన్నికల వల్ల షూటింగ్‌కు విరామం ఇచ్చిన పవన్‌కల్యాణ్ కుదిరిన సమయంలో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అలా ఈ మధ్యన విజయవాడలో వేసిన ప్రత్యేక సెట్‌లో కొంత షూటింగ్ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. 'హరి హర వీరమల్లు' చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో అలరించనుంది. ఈ క్రమంలో మొదటి గీతాన్ని తెలుగులో మాట వినాలి, తమిళంలో కెక్కనుం గురువే, మలయాళంలో కేల్‌క్కనం గురువే, కన్నడలో మాతు కేలయ్యా , హిందీలో బాత్ నీరాలి గా విడుదల చేశారు. కీరవాణి యొక్క అద్భుతమైన స్వరకల్పనకు తెలుగులో పెంచల్ దాస్, తమిళంలో పి.ఎ. విజయ్, మలయాళంలో మంకొంబు గోపాలకృష్ణన్, కన్నడలో ఆజాద్ వరదరాజ్, హిందీలో అబ్బాస్ టైరేవాలా సాహిత్యం అందించారు.
హరి హర వీరమల్లు చిత్రం 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అణగారిన వర్గాల కోసం అన్యాయంపై పోరాడే యోధుడు కథగా తెరకెక్కుతోంది. చిత్రీకరణ తుది దశలో ఉంది. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా చురుకుగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుస్తుండగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు.