Hanu Raghavapudi: 'ఫౌజీ' గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన దర్శకుడు

ABN , Publish Date - Jan 26 , 2025 | 01:07 PM

ఆ కథకు ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఇదే విషయాన్ని గతంలోనూ చెప్పాను. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో నా వద్ద సుమారు ఆరు కథలున్నాయి. ఇది మాత్రం ప్రత్యేకంగా ప్రభాస్‌ కోసమే రాశాను.- Hanu Raghavapudi


ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా హను రాఘవపూడి 9Hanu Raghavapudi) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే! ఈ చిత్రానికి ఫౌజీ’ (Fouzi) అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. సోషల్‌ మీడియా స్టార్‌ ఇమాన్వీ ఎస్మాయిల్‌ (Imanvi) కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఉద్దేశించి దర్శకుడు హను రాఘవపూడి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రభాస్‌ కోసమే రాసిన కథని పేర్కొన్నారు. ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేేస ఎన్నో విశేషాలు ఈ చిత్రంలో ఉన్నాయని సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. ‘‘ఈ చిత్రం తప్పకుండా కొత్తగా ఉంటుంది. మీరు ఇంతవరకు చూడని కథను చూపిస్తున్నాం. ప్రభాస్‌ ఉన్నారు కాబట్టి ఎన్ని అంచనాలను అయినా ఇది అందుకుంటుంది. ఇప్పటి వరకూ ఎప్పుడూ చూడని ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది’’ అని అన్నారు. నానితో తాను చేస్తానన్న స్ర్కిప్ట్‌ ఈ సినిమా ఒక్కటేనంటూ వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు.


‘‘ఆ కథకు ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఇదే విషయాన్ని గతంలోనూ చెప్పాను. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో నా వద్ద సుమారు ఆరు కథలున్నాయి. ఇది మాత్రం ప్రత్యేకంగా ప్రభాస్‌ కోసమే రాశాను. నా వద్ద ఉన్న వాటిల్లోంచి ఎంచుకున్నది కాదు. ‘సీతారామం’ తర్వాత దీన్ని రాయడానికే సుమారు ఏడాదికి పైగా సమయం పట్టింది. ప్రేక్షకులు తప్పకుండా సర్‌ప్రైజ్‌ ఫీలవుతారు’’ అని సమాధానమిచ్చారు. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇమాన్వీని కథానాయికగా ఎంచుకోవడంపై హను రాఘవపూడి స్పందించారు. ‘‘ఇమాన్వీ అందం, ప్రతిభ గల అమ్మాయి. అందరిలాగానే నేనూ ఆమె డ్యాన్స్‌ వీడియోలు చూస్తుంటా. ఆమె మంచి భరతనాట్యం డ్యాన్సర్‌. కళ్లతోనే ఎన్నో హావభావాలను పలికిస్తుంటుంది. అందుకే ఆమెకు ఒక అవకాశం ఇవ్వాలనుకున్నా’’ అని హను అన్నారు. 

Updated Date - Jan 26 , 2025 | 01:07 PM