Tollywood Actress: చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ 

ABN , Publish Date - Jan 28 , 2025 | 11:56 AM

తండ్రితో కలిసి ఛైల్డ్‌ ఆర్టిస్టుగా నటించిన ఈ క్యూటీ ఆ తర్వాత హీరోయిన్‌గా సత్తా చాటింది. అంతే కాదు మల్టీటాలెంటెడ్‌ పర్సర్‌ ఈమె.

ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి స్టార్లుగా ఎదిగిన తారలు ఎందరో ఉన్నారు. అందులో ఈ చిన్నారి (Child Artist) కూడా ఒకరు. తండ్రి  టాప్ హీరో. తల్లి కూడా పేరొందిన నటే. దీంతో సినిమా ఇండస్ట్రీలోకి త్వరగానే ఎంట్రీ లభించింది. అయితే స్వతహాగా ఎదిగింది. తండ్రితో కలిసి ఛైల్డ్‌ ఆర్టిస్టుగా నటించిన ఈ క్యూటీ ఆ తర్వాత హీరోయిన్‌గా సత్తా చాటింది. అంతే కాదు మల్టీటాలెంటెడ్‌ పర్సర్‌ ఈమె (Multi talented artist actress). సంగీత దర్శకురాలిగా, హీరోయిన్‌గా, సింగర్‌ గానూ సత్తా చాటుతోంది. (Singer Shruti Haasan)

Sjruthi.jpg

అయితే హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించిన కొత్తలో ఈ అమ్మడికి అంతగా కలిసి రాలేదు. వరుస పరాజయాలతో ఐరన్‌ లెగ్‌ అనే ట్యాగ్‌ పడింది. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌తో (Shruti Haasan - Gabbar singh) ఒక్క సినిమా పడింది. అంతే ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది. జాతకమే మారిపోయింది. తర్వాత టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు అందరితో యాక్ట్‌ చేసింది(Music Director Shruti Haasan).  వరుస విజయాలు అందుకొంది. మధ్యలో లవ్‌, డేటింగ్‌ అంటూ కాస్త గ్యాప్‌ తీసుకున్నా రీ ఎంట్రీలో దుమ్ము దులుపుతోంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో చేసిన సినిమాలన్నీ సూపర్‌ హిట్స్‌గా నిలిచాయి. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? ఈ మల్టీ టాలెంటెడ్‌ హీరోయిన్‌ ఎవరో కాదు విశ్వనాయకుడి కూతురు శ్రుతీహాసన్‌. మంగళవారం ఆమె పుట్టిన రోజు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు  చెబుతున్నారు.


Sjruthi-2.jpgవకీల్‌ సాబ్‌, క్రాక్‌, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్‌ పార్ట్‌-1.. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతుంది శ్రుతీహాసన్‌. ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.  రజనీ కాంత్‌ -లోకేశ్‌ కనగరాజ్‌ కాంబోలో వస్తోన్న కూలీ సినిమాలో శ్రుతి హాసన్‌ నటిస్తోంది. అలాగే విజయ్‌ సేతుపతి 'ట్రైన్‌'  సలార్‌ పార్ట్‌ 2లోనూ భాగమైంది.  తెలుగులో అడివి శేష్‌ సరసన  'డకాయిట్' చిత్రంలో ఎంపికై, కొంత షూటింగ్‌ అయిన తర్వాత పలు కారణాల చేత ఈ చిత్రం నుంచి  తప్పుకొన్నారు. 

Updated Date - Jan 28 , 2025 | 11:56 AM