Tollywood Heroine: ఈ చిన్నారి ఇప్పుడు స్టార్‌ హీరో భార్య.. గుర్తు పట్టండి.. 

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:55 PM

తాజాగా ఓ చిన్నారి ఫోటో నెటిజన్లకు ఆకర్షించింది. చారడేసి కళ్లు.. రెండు జడలతో కనిపిస్తున్న ఆ చిన్నారిని గుర్తుపట్టారా? ఇప్పుడు ఆమె పాన్‌ ఇండియా హీరోయిన్‌. అంతే కాదు. టాలీవుడ్‌ స్టార్‌ హీరోకి భార్య కూడా.

సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తూనే ఉంటుంది. హీరోహీరోయిన్లు తమ ఫొటోలను అభిమానులతో షేర్‌ చేసుకోవడానికి పోస్ట్‌లు పెడుతుంటారు. చిన్నప్పటి ఫొటోలకైతే మరింత క్రేజ్‌ ఉంటుంది. తాజాగా ఓ చిన్నారి ఫోటో నెటిజన్లకు ఆకర్షించింది. చారడేసి కళ్లు.. రెండు జడలతో కనిపిస్తున్న (Guess The cute Girl) ఆ చిన్నారిని గుర్తుపట్టారా? ఇప్పుడు ఆమె పాన్‌ ఇండియా హీరోయిన్‌ (Pan india Heroine) అంతే కాదు సౌత్‌, నార్త్‌ రెండు ఇండస్ట్రీల్లోనూ బిజీగా ఉంది. సినిమాలే కాకుండా వెబ్‌సిరీస్‌లతోనూ దూసుకెళ్తుంది. అంతే కాదు. టాలీవుడ్‌ స్టార్‌ హీరోకి భార్య కూడా. wife of Star Hero)

Chay.jpg


ఇంతకీ ఈ చారడేసి కళ్లు.. రెండు జడలతో కనిపిస్తున్న ఆ చిన్నారిని గుర్తుపట్టారా? ఈ హీరోయిన్‌ ఎవరో కాదు. అక్కినేని నాగచైతన్య సతీమణి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala). మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  2013లో ఫెమినా మిస్‌ ఇండియా పోటీలో పాల్గొని ఫెమినా మిస్‌ ఇండియా ఎర్త్‌ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె మిస్‌ ఎర్త్‌ 2023 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2016లో అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించిన సైకలాజికల్‌ క్రేౖమ్‌ థ్రిల్లర్‌ చిత్రం 'రామన్‌ రాఘవ్‌ 2.0’తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస చిత్రాల్లో నటించింది. గతేడాది డిసెంబర్‌ 4న అక్కినేని నాగచైతన్యను (Naga Chaitanya) ప్రేమ పెళ్లి చేసుకుంది. వీరి వివాహం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. ప్రస్తుతం చైతూ తండేల్‌ మూవీలో నటిస్తున్నాడు. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. శోభిత తెలుగులో గూఢచారి, మేజర్‌, తమిళంలో పొన్నియన్‌ సెల్వన్‌, హిందీ, మలయాళ భాషల్లో పలు చిత్రాలతో గుర్తింపు పొందింది. హాలీవుడ్‌లో 'మంకీ మెన్‌' చిత్రంలో నటించింది. 

Sobhita.jpg

Updated Date - Feb 03 , 2025 | 02:19 PM