Star Hero: చిరుతకి భయపడుతున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా..
ABN , Publish Date - Jan 28 , 2025 | 07:19 PM
Star Hero: ఆయన మూడో సినిమాని అభిమానులు మరిచిపోలేరు. నిర్మాత అసలే మరిచిపోలేడు.
పై ఫొటోలో చిరుతకు భయపడుతున్న హీరో మామూలోడు కాదు. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా ఆసక్తికరమైన జోనర్ లలో సినిమాలు తీస్తూ గ్లోబల్ స్థాయిల్లో అందరి దృష్టిలో పడ్డాడు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ 5 హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. డెబ్యూ చిత్రంతోనే స్టార్ డైరెక్టర్ తో పని చేసే ఛాన్స్ కొట్టేశాడు. తొలి సినిమా 38 సెంటర్ లలో 100 రోజులు పూర్తి చేసుకొని హిట్ గా నిలిచింది. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని రెండో సినిమాతోనే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.
మీరు ఇప్పటికి ఆ హీరోని గుర్తుపట్టకపోతే.. ఆయన మూడో సినిమాని అభిమానులు మరిచిపోలేరు. నిర్మాత అసలే మరిచిపోలేడు. ఆ తర్వాత పర్వాలేదనిపించే కొన్ని సినిమాలు తీసి బాలీవుడ్ డెబ్యూ చేశాడు. కానీ.. ఆ సినిమా రిజల్ట్ తర్వాత అక్కడ కన్నెత్తి చూసే పని మళ్ళీ చేయలేదు. కొన్నేళ్ల తర్వాత ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ ఆయనకు ఒక డేరింగ్, రూటెడ్ కథని అందించి.. విమర్శకుల నోర్లు మూయించాడు. ఆ తర్వాత జీవితంలో మరిచిపోలేని మరో ప్లాప్. కానీ ఆ తర్వాత జీవితానికి సరిపోయేంత ఒక బిగ్గెస్ట్ హిట్. ఇటీవల మరో సారి మన ముందుకు ఓ సందేశము ముందుకు వచ్చిన ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు. ప్రస్తుతం ఓ గేమ్ బేస్డ్ మూవీలో నటిస్తున్నాడు.
ఇప్పటికి మీరు ఆ హీరోని గుర్తించకపోతే తెలుగు సినిమా అభిమానులే కాదు. ఇంతకీ ఆ చిరుతకి భయపడుతున్న చిరుత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. రామ్ చరణ్ ని పట్టుకొని ధైర్యం చెబుతుంది, ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి.
ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తాజా షెడ్యూల్ ఈ నెల 29 నుంచి హైదరాబాద్‌లో మొదలవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం మైసూర్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజగా షెడ్యూల్‌లో చరణ్‌తోపాటు సినిమాలో ప్రధాన తారాగణంతో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నా బుచ్చిబాబు. ఈ సినిమాతో ఈ ఏడాది గడిచిపోతుంది. తదుపరి సుకుమార్‌తో సినిమా ఉంటుంది.